మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రెజెంట్ నటిస్తున్న సినిమా గని.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.ఈ సినిమా లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

గని సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.వరుణ్ తేజ్ తన నటనతో గూస్ బంప్స్ వచ్చేలా చేసాడు.ఈ ట్రైలర్ లో ఏం చుపించారంటే.తల్లికి తెలియకుండా బాక్సింగ్ నేర్చుకుంటాడు గని.
కానీ తన తల్లి మాత్రం బాక్సింగ్ నేర్చుకోకూడదు అని ఒట్టు వేయించుకుంటుంది.తన తల్లికి ఈ విషయం తెలిసేలోపు అతడు ఛాంపియన్ అవ్వాలని పట్టుదలతో శ్రమిస్తూ ఉంటాడు.
కానీ ఇక్కడ కూడా రాజకీయాలు ఎదురవడంతో వరుణ్ ఫ్రేస్టేట్ అవుతూ ఉంటాడు.ఈయనకు పోటీగా నవీన్ చంద్ర కూడా బాక్సింగ్ రంగంలోకి దిగుతాడు.అసలు వరుణ్ బాక్సింగ్ లో గెలుస్తాడా.విన్నర్ అవుతాడా.
అనేది మిగిలిన కథ.

ఈ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచేశారు.వరుణ్ నటన అద్భుతంగా ఉంది అని అందరు ఆయనను ప్రశంసిస్తున్నారు.ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా సునీల్ శెట్టి, వరుణ్ తల్లిగా నదియా, తండ్రిగా జగపతిబాబు, పోలీస్ ఆఫీసర్ గా ఉపేంద్ర కనిపించారు.
మరి ఏప్రిల్ 8న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని వరుణ్ కి అందిస్తుందో వేచి చూడాలి.







