ఆలస్యం... F3 ఆ సినిమాలకు పాఠంగా నిలిచేనా?

వెంకటేష్వరుణ్‌ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ ఇంకా సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్‌ గా నటించిన చిత్రం ఎఫ్‌ 3.ఈ సినిమా విడుదల అయ్యి యాబై రోజులు అవ్వబోతుంది.

 ఆలస్యం… F3 ఆ సినిమాలకు పాఠంగా-TeluguStop.com

ఎట్టకేలకు ఈ సినిమా ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.అనీల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించాడు.

ఈ సినిమా ను మూడు లేదా నాలుగు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తే బాగుండేది అంటూ ప్రేక్షకులు భావించారు.కాని సినిమా ను యాబై రోజుల వరకు స్ట్రీమింగ్‌ చేసేది లేదు.

థియేటర్ లోనే మీరు చూడాల్సిందే అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.అన్నట్లుగానే ఎఫ్ 3 సినిమా ను థియేటర్ల నుండి ఓటీటీ లో వదలడానికి ఏకంగా యాబై రోజులు పట్టింది.

యాబై రోజుల తర్వాత ఎఫ్ 3 ఓటీట లో రావడంతో ప్రేక్షకులు పెద్దగా పట్టింపు లేనట్లుగా స్ట్రీమింగ్‌ పై పెద్దగా ఆలోచన లేనట్లుగా ఉన్నారు.

ఎఫ్ 3 కోసం కొందరు ఎదురు చూసిన మాట వాస్తవమే.

కాని ఎఫ్ 3 సినిమా హడావుడి కనిపించలేదు.యాబై రోజులు అయ్యింది కనుక చూడని వారు కూడా పెద్ద ఆసక్తిగా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అవ్వడం లేదు.

ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నెట్‌ ఫ్లిక్స్ మరియు సోని లివ్‌ లు ఉన్నాయి.ఈ రెంటి లో కూడా నామమాత్రపు స్ట్రీమింగ్‌ మినిట్స్ నమోదు అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా ను తెలుగు లో ఎక్కువ ఆధరణ లేని నెట్‌ ఫ్లిక్స్ మరియు సోని లివ్‌ ల్లో స్ట్రిమింగ్‌ చేయడం వల్ల కూడా జనాలు పెద్దగా ఈ సినిమా ను ఆధరించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.ఎఫ్ 3 కి లాంగ్‌ రన్‌ లో మంచి స్ట్రీమింగ్‌ రికార్డు దక్కే అవకాశం ఉందని కొందరు అంటూ ఉంటే ఆలస్యం అయిన కారణంగా ఎఫ్ 3 కి స్పందన కరువు అంటున్నారు.

ముందు ముందు వచ్చే సినిమాలైనా కాస్త ముందుగా వస్తాయేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube