'ది ఘోస్ట్'తో వరుణ్ ప్లాన్ మార్చుకోనున్నాడా.. మరి ప్రవీణ్ సత్తారు నెక్స్ట్ ఏంటి?

ప్రవీణ్ సత్తారు.ఇతడు డైరెక్టర్ గా బిజీగా ఉన్నాడు.

అమెరికాలోనే చదువు పూర్తి చేసుకుని మంచి జాబ్ లైఫ్ వదిలేసి తన ఫ్యాషన్ కోసం ఇక్కడికి వచ్చి డైరెక్టర్ గా మారిపోయాడు ఎంతో ఇష్టమైన డైరెక్షన్ లోనే కెరీర్ కొనసాగించాలని ఇక్కడకు వచ్చాడు.ఇతడికి మన టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది.

ఇతడు రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్ అనే సినిమాలను తెరకెక్కించాడు.ఇక ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన గరుడవేగ హిట్ అవ్వడంతో ఈయనకు మంచి పేరు వచ్చింది.

దీంతో నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.నాగార్జునతో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కించాడు ప్రవీణ్ సత్తారు.

Advertisement

సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత యావరేజ్ టాక్ వచ్చింది.

అలాగే ఓపెనింగ్స్ కూడా దారుణంగా రావడంతో ఈ సినిమా పరిస్థితి దారుణంగా మారిపోయింది.ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంది.అయితే ఈ లోపులోనే ది ఘోస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ సినిమాను నాగబాబు నిర్మిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే నాగబాబు కెరీర్ లో చాలానే డిజాస్టర్స్ ఉన్నాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

దీంతో ఈ సినిమాను ఎలా తెరపైకి వస్తుంది అనేది పెద్ద సమాధానం లేని ప్రశ్నగా మిగిలి పోయింది.మరి ఘోస్ట్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదంటే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఇక్కడే ఆగిపోతుందా అనేది తెలియాలి.

Advertisement

మరి వరుణ్ తేజ్ ప్రెజెంట్ మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.దీంతో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావాలంటే మరి కొద్దీ రోజులు వేచి ఉండాల్సిందే.

తాజా వార్తలు