లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ రోజు విడుదలైన సినిమా ‘వరుడు కావలెను’. పి డి వి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు.
ఇందులో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించాడు.రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.
అంతేకాకుండా మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్, హిమజ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది.మొత్తానికి ఈ రోజు ఈ సినిమా విడుదల కాగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ:
ఈ సినిమాలో నాగ శౌర్య ఆకాశ్ అనే ఆర్కిటెక్ట్ పాత్రలో నటించాడు.ఈయన ఇండియా నుంచి దుబాయ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అవుతాడు.ఇక ఎన్ఆర్ఐ గా ఉన్న తను తన ప్రాజెక్టు పనుల కోసం మళ్లీ ఇండియాకు వస్తాడు.
ఇండియాలో తన ప్రాజెక్టు వరకు కంపెనీకి మేనేజర్ గా రీతు వర్మ భూమి అనే పాత్రలో నటిస్తుంది.ఇక ఆమెను కలుస్తాడు.భూమిని చూసిన మొదటి రోజు నుంచి ఆమె వెంటపడుతుంటాడు.ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.
దీంతో ఆకాష్ భూమిని కాకుండా నేరుగా భూమి తల్లి నదియాతో పరిచయం పెంచుకుంటాడు.నిజానికి సినిమాలో భూమి చాలా మొండిగా ప్రవర్తిస్తుంది.
ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో చాలా కఠినంగా ఉంటుంది.దీంతో ఆకాష్ భూమిని ఎలా ప్రేమలో పడేస్తాడు అనేది ఆ తర్వాత ట్విస్ట్ ఎలా ఉంటుంది అనేది మిగతా స్టోరీ లో చూడవచ్చు.

నటినటుల నటన:
నాగ శౌర్య, రీతు వర్మ అద్భుతంగా నటించారు.ఇందులో నాగశౌర్య ఈ కథకు తగ్గట్టుగా బాగా సెట్ అయ్యాడు.నాగ శౌర్య, రీతు వర్మ మధ్యల కామెడీ సీన్స్ బాగా ఉన్నాయి.
టెక్నికల్:
టెక్నికల్ గా సినిమా పర్వాలేదు అనిపించింది.సాంగ్స్ మాత్రం బాగా హైలెట్ గా నిలిచాయి.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఆకట్టుకుంది.ఇక తమన్, విశాల్ చంద్రశేఖర్ తమ సంగీతంతో బాగానే మెప్పించారు.

విశ్లేషణ:
డైరెక్టర్ ఈ సినిమాకు కథ తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నాడు.చాలా వరకు కథను బాగా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకున్నాడు.కానీ కథలో మాత్రం అంతగా కొత్తదనం లేదన్నట్లు అనిపిస్తుంది.కానీ అక్కడక్కడ కామెడీ మాత్రం బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
డైలాగ్స్, కామెడీ బాగా ఆకట్టుకుంది.కమెడియన్స్ అంతా పెళ్లి సమయంలో చేసిన కామెడీ ప్లస్ పాయింట్ గా నిలిచింది.సాంగ్స్ కూడా బాగున్నాయి.