అప్పుడప్పుడు కొంతమంది నటీనటులు పెళ్లిళ్ల ( Marriages ) గురించి కామెంట్లు చేస్తుంటే ఇక వాళ్లకు పెళ్లిళ్లపై ఆసక్తి లేదేమో అని అనుమానాలు వస్తూ ఉంటాయి.అసలు పెళ్లికి వాళ్లకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.
మరి వారికి పెళ్లి అంటే ఎందుకు విరక్తి వస్తుందో తెలియదు కానీ.కొందరికి మాత్రం పెళ్లి అనేది తమ కెరీర్ కు అడ్డు అని తెలుస్తుంది.
అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్( Varalakshmi Sarathkumar ) కూడా పెళ్లిపై ఆసక్తి చూపించడం లేదని.అసలు పెళ్లంటే తన దృష్టిలో మరో అర్థమని తెలిసింది.
ఇంతకూ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్ క్యారెక్టర్ కంటే నెగిటివ్ రోల్ లో మంచి పేరు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.ఈమె 2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.ఇక వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.
అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.
ఇక ప్రస్తుతం ఆమె వరుస సినిమాలలో చేస్తూ బాగా బిజీగా ఉంది.ఇక గతంలో కాస్త బొద్దుగా ఉన్న వరలక్ష్మి ఇప్పుడు బాగా సన్నబడి బాగా ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై కూడా గెస్ట్ గా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఆమె ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షోకి( Sixth Sense show ) పాల్గొంది.అందులో తనతో పాటు హీరోయిన్ బిందు మాధవి కూడా పాల్గొంది.అయితే ఈ సందర్భంగా ఓంకార్ వారిద్దరిని పెళ్లి గురించి ప్రశ్నించాడు.దాంతో వెంటనే వరలక్ష్మి శరత్ కుమార్.అబ్బో అంటూ తన రెండు చేతులతో రెండు ఫింగర్స్ ను క్రాస్ మార్కుగా చూపించింది.
దాంతో వెంటనే ఓంకార్.ఆ సింబల్ కి అర్థం ఏంటి అని అడగటంతో.భూతం వంటి వాటికి అటువంటి సింబలే చూపిస్తారు కదా.అందుకే నేను కూడా ఆ పెళ్లి గురించి ప్రశ్న నాకు రావద్దు అని అలా పెట్టాను అంటూ.నా దృష్టిలో పెళ్లి అంటే భూతం అంటూ చెప్పటంతో వెంటనే ఓంకార్ ఆశ్చర్యపోయాడు.ఇక దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వగా.అయితే వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇప్పుడు పెళ్లి అవ్వటం కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.