ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ కూడా వరుసగా వింత వ్యాధులతో బాధపడుతూ సతమతమవుతున్నారు .అయితే ఒకానొక సమయంలో హీరోయిన్స్ వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బయట పెడితే కనుక వారికి సినిమా అవకాశాలు తగ్గిపోతాయని భావించేవారు.
ఈ క్రమంలోనే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బయటకు చెప్పేవారు కాదు .కానీ ప్రస్తుతం మాత్రం వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అందరితో పంచుకోవడం వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుందన్న కారణంతో ఎంతో మంది సెలబ్రిటీలు వారు బాధపడుతున్నటువంటి సమస్యల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో వింత వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా మయోసైటిస్ (Myositis) వ్యాధితో బాధపడుతున్నానని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో ఎంతోమంది ఈమెకు ధైర్యం చెబుతూ ఆమెకు సపోర్ట్ చేశారు.ఇలా తన స్నేహితుల నుంచి అభిమానుల నుంచి మంచి సపోర్ట్ రావడంతో సమంత కూడా మానసికంగా ఈ వ్యాధి నుంచి బయటపడింది.ఇలా సమంత తన వ్యాధి గురించి బయటపెట్టిన తర్వాత చాలామంది మేము కూడా సమంత అలాగే బాధపడుతున్నాము అంటూ వారు పడుతున్నటువంటి ఇబ్బందులను బయటకు చెప్పుకున్నారు.

ఇక తాజాగా నటి వనిత విజయ్ కుమార్ (Vanitha Vijay kumar) సైతం ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నానని తన అనారోగ్య సమస్యలను బయటపెట్టారు.అయితే వనిత విజయ్ కుమార్ క్లాస్ట్రోఫోబియా (Claustrophobia) అనే వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించారు.అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే ఈ వ్యాధితో బాధపడేవారు ఎక్కువగా చిన్నచిన్న ప్రదేశాలలో ఉండడానికి ఇష్టపడరు.అలాగే లిఫ్ట్ వాష్ రూమ్ లో ఎక్కువసేపు ఉండాలన్నా కూడా భయంగానే ఉంటుందట ఇక జనాల మధ్యలో వచ్చిన వారికి ఊపిరాడని భావన కలుగుతుందని తాను ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా వనిత విజయ్ కుమార్ తాను ఎదురుకుంటున్నటువంటి అనారోగ్య సమస్య గురించి బయట పెట్టడంతో అభిమానులు కూడా ఈమెకు ధైర్యం చెబుతున్నారు.







