వంగవీటి రాధాకృష్ణ : మా ఆఫీస్ పక్కనే జనసేన ఆదివారం సమావేశం పెట్టుకున్నారు.ఈరోజు నాదెండ్ల మనోహర్ అక్కడకి వచ్చారు.
పక్కనే ఉన్న మా కార్యాలయానికి మనోహర్ వచ్చారు.టి తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం.
రాజకీయ పరిణామాలు ఏమీ లేవు.సరదాగా చాలా మాట్లాడుకున్నాం.
సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు నాకు తెలియదు.మీడియా లేనిపోని హడావుడి చేయకండి.
టీ తాగడానికి మాత్రమే వచ్చారు.కలిసి తాగాం.
నాదెండ్ల మనోహర్: జనసేన జనవాణి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించాను.పక్కనే రాధా ఆఫీసు ఉండటంతో ఇక్కడకి వచ్చాను.
మర్యాద పూర్వకంగా రాధాను కలిశాను.మా మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు లేవు.
టీ తాగి, కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నాం.కరెంట్ ఏఫైర్స్ కాదు… కరెంటు ఛార్జీలు గురించి చర్చించాం.







