గబ్బర్‌సింగ్ చిత్రంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన హరీష్ శంకర్ ‘డీజే’ చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఇది.తమిళ హిట్ మూవీ జిగర్తాండకు ఇది రీమేక్.2014లో వచ్చిన మూవీకి ఇప్పుడు రీమేక్ చేయడం ఏంటో అంటూ చాలా మంది అనుకున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ చాలా వరకు జిగర్తాండను మార్చేశాడు.
కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డేను పెట్టాడు.ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ లుక్ అదిరింది.
విడుదలకు కొన్ని గంటల ముందు వాల్మీకి టైటిల్‌పై వివాదం రావడంతో గద్దలకొండ గణేష్ అనే టైటిల్‌తో విడుదల చేయడం జరిగింది.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
బాల మురళిరామ( అథర్వ) ఒక యువ దర్శకుడు.విభిన్నమైన చిత్రాన్ని తీయాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడుతూ ఉంటాడు.
ఒకానొక సమయంలో బాల రౌడీ అయిన గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) వద్దకు వెళ్తాడు.ఇద్దరి మద్య సాగే జర్నీ ఎలా ఉంటుంది? అసలు గణేష్ వద్దకు బాలా ఎందుకు వెళ్లాడు? గణేష్ గతం ఏంటీ? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన :
వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.ముఖ్యంగా క్రూరమైన విలన్‌గా కనిపించిన సమయంలో వరుణ్ నటన చాలా బాగుంది.ఒక నటుడికి ఇలాంటి పాత్రలు పడితేనే ఆ నటుడిలోని ప్రతిభకు గుర్తింపు దక్కినట్లవుతుంది.వరుణ్‌కు ఆ ఛాన్స్ దక్కింది.మేకప్ విషయంలో కూడా మంచి లుకింగ్ అనిపించింది.ఇక యంగ్ ఏజ్ గెటప్ అదిరింది.
పాత సినిమాల్లో చిరంజీవిని గుర్తు చేశాడు.ఇక దర్శకుడిగా కనిపించిన హీరో అథర్వకు ఉన్నంతలో పర్వాలేదు అనిపించాడు.
ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఉన్నది కొద్ది సమయమే అయినా సినిమాపై ఆమె ముద్ర కనిపించేలా చేసింది.మరో హీరోయిన్ మృనాలిని పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు.ఇక ఇతర పాత్రల్లో నటించిన బ్రహ్మాజీ ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించారు.
టెక్నికల్ :
మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.పాటలు పెద్దగా ఆకట్టుకునే విధంగా ఏమీ లేవు.అయితే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ సినిమాలో కూడా ఆకట్టుకుంది.ఆ పాటను మరీ ఎక్కువగా రీమిక్స్ చేసి పాడు చేయకుండా దర్శకుడు హరీష్ శంకర్ మరియు మిక్కీజే మేయర్ జాగ్రత్త పడ్డారు.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది.చాలా సీన్స్ కలర్ ఫుల్‌గా నాచురల్‌గా రావడంలో సినిమాటోగ్రఫీ పనితనం చాలా బాగుంది.
ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి.దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెంచి ఉంటే బాగుండేది.
నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
దర్శకుడు హరీష్ శంకర్ చాలా స్క్రిప్ట్‌లు అనుకుని చివరకు రీమేక్‌కు సిద్దం అయ్యాడు.గతంలో దబాంగ్ చిత్రంను గబ్బర్‌సింగ్‌గా రీమేక్ చేసి సెన్షేషనల్ హిట్‌ను దక్కించుకున్న హరీష్ శంకర్ ఆ సెంటిమెంట్ కారణంగానే మరోసారి రీమేక్‌కు సిద్దం అయ్యాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా జిగర్తాండకు పూర్తి విభిన్నంగా ఉంది.
ఈ చిత్రం మొత్తం కూడా వరుణ్ తేజ్ సెంటర్‌గా సాగింది.సినిమాలో ప్రత్యేకంగా తీసుకున్న పూజా హెగ్డే పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దర్శకుడు కమర్షియల్‌గా సినిమాను చాలా ఎలిమెంట్స్‌ను ప్లాన్ చేశాడు.అయితే కామెడీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.కమర్షియల్ విలువలు తగ్గాయి.జిగర్తాండతో పోల్చితే పర్వాలేదు అనిపించినా తెలుగు వారికోసం ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాల్సిందే.మొత్తంగా ‘వాల్మీకి’ అదే మన గద్దలకొండ గణేష్ ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
వరుణ్, పూజాహెగ్డే సీన్స్,
కొన్ని కామెడీ సీన్స్,
ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ రీమిక్స్
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్,
స్క్రీన్‌ప్లే,
స్టోరీ లైన్ రొటీన్‌గా ఉంది
రేటింగ్ : 2.75/5.0