ఎట్టకేలకు మెగా హీరోను ఒప్పించిన సురేందర్ రెడ్డి.. ఇంతకీ ఎవరంటే?

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ( Director Surender Reddy )గురించి తెలియని వారు లేరు.ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.

 Vaishnav Tej Teaming Up With Surender Reddy , Vaishnav Tej, Surender Reddy, Akhi-TeluguStop.com

అయితే అంతే స్థాయిలో డిజాస్టర్స్ కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి.అందులో ఈ మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ కూడా ఒకటి.

అక్కినేని అఖిల్ ( Akkineni Akhil )హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూసింది.

ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయగా దారుణమైన ఫలితం వచ్చింది.అనిల్ సుంకర( Anil Sunkara ) పెట్టిన బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేక పోయింది.

ఇక ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈయనతో పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.ఏ హీరో కూడా ఇంతటి డిజాస్టర్ తర్వాత మూవీ అంటే భయపడుతున్నారు.

Telugu Aadikeshava, Akhil Akkineni, Sreeleela, Srikanthn, Surender Reddy, Vaishn

అయితే తాజాగా ఈయనకు ఒక మెగా హీరో ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.ఈ స్టైలిష్ డైరెక్టర్ తో పని చేయడానికి మెగా హీరోల్లో ఒక హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.ఆ హీరో ఎవరో కాదు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.ఈయనతో మూవీ చేయడానికి ఒప్పుకున్నట్టు టాక్.పంజా వైష్ణవ్ తేజ్ సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Telugu Aadikeshava, Akhil Akkineni, Sreeleela, Srikanthn, Surender Reddy, Vaishn

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి నిర్మాత కోసం వెతుకుతున్నాడని.మీడియం బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్.అనుకున్న విధంగా నిర్మాత కనుక దొరికితే ఈ ప్రాజెక్ట్ అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej )ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ’.కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా జులైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube