మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వారిలో నటుడు పంజా వైష్ణవ్ ( Vaishnav ) ఒకరు.ఉప్పెన( Uppena ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వైష్ణవ్ అనంతరం కొండ పొలం రంగా రంగా వైభవంగా వంటి సినిమాలలో నటించారు.
తాజాగా ఈయన ఆది కేశవ ( Aadi Kesava ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆది కేశవ.
మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ ఇందులో విలన్ గా నటిస్తూ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.ఆదికేశవ సినిమాలో వైష్ణవ్ సరసన శ్రీలీల( Sreeleela ) నటించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.ఇలా థియేటర్లలో భారీ డిజాస్టర్ అయినటువంటి ఈ సినిమా ఇటీవల బుల్లితెరపై ప్రసారమైంది.థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినటువంటి ఈ సినిమా గత ఆదివారం స్టార్ మా లో ప్రసారమైంది.

డిజిటల్ ప్రీమియర్ గా నెట్ ఫ్లిక్స్( Netflix ) లోకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా టెలివిజన్ ప్రీమియర్ అయినటువంటి ఈ సినిమా అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ సినిమాకు అర్బన్ ఏరియాలో 10.47 రేటింగ్ దక్కింది.అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 9.87 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు.వైష్ణవ్ నటించిన ఉప్పెన సినిమాకు 16 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.ఇక కొండపొలం సినిమాకు 9 రేటింగ్స్ వచ్చాయి.ఇప్పుడు ఆదికేశవ చిత్రానికి ఏకంగా 10 రేటింగ్స్ వచ్చాయి.
ఈ ట్రాక్ రికార్డు చూస్తుంటే పంజా వైష్ణవ్ తేజ్ ని బుల్లితెర ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారని చెప్పాలి.







