అయ్యో నా వయసు అంత కాదు.. గూగుల్ ని అస్సలు నమ్మొద్దు.. వైష్ణవ్ తేజ్!

టాలీవుడ్ మెగాహీరో వైష్ణవ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే.మొదట ఉప్పెన సినిమా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు హీరో వైష్ణవ తేజ్.

 Vaishnav Tej About His Age At Ranga Ranga Vaibhavanga Teaser Launch Event Vaishn-TeluguStop.com

మొదటి సినిమాతోనే వంద కోట్ల మార్కును సాధించాడు.ఈ సినిమా తర్వాత కొండ పొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇది ఇలా ఉంటే వైష్ణవ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రంగ రంగ వైభవంగా.గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి బ్యానర్ పై బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటించింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఈ సినిమా జులై 1న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

లవ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కలిగిన ఫ్యామిలీ డ్రామా సినిమాగా సినిమా తెరకెక్కబోతోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వైష్ణవ్ తేజ్ పై యూట్యూబర్ గలాటా గీతు ప్రశంసలు కురిపిస్తూ.డైరెక్ట్ గా అతని ఏజ్ గురించి అడిగేసింది./br>

Telugu Galata Gethu, Ketika Sharma, Rangaranga, Tollywood, Vaishnav Tej-Movie

అప్పుడు వైష్ణవ్ తేజ్ ఏమాత్రం ఆలోచించకుండా టక్కున సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.ఇంత లేటుగా సినిమాల్లోకి ఎందుకు వచ్చారు ముందే రావాల్సిందిగా అని గీతు అడగడంతో కరెక్ట్ ఏజ్ లోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.ఇంతకంటే తక్కువ ఏజ్ లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే చిన్న పిల్లవాడిలా ఉంటాను.అసలు హీరో అనుకోవాలి అని అనుకోలేదు ఏదో సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేయక అది డైరెక్టర్ చూసి అవకాశం ఇచ్చారు అలా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాను అని తెలిపారు వైష్ణవ్ తేజ్.

ఎందుకలా ఏజ్ గురించి అడిగారు అని అడగగా అప్పుడు గీతు గూగుల్ మీ ఏజ్ గురించి చాలా బీభత్సంగా చెప్పింది. మీకు 32 ఏళ్ల అని చూపిస్తుంది అది నిజం అనుకున్నాను అని అనడంతో గూగుల్ ని నమ్మవద్దు నా ఏజ్ అంత కాదు అని తెలిపారు వైష్ణవ్ తేజ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube