ఆ స్టేడియం లో ఏడ్చిన నటి సురేఖావాణి.. చిరంజీవి గ్రేట్ అంటూ?

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన సురేఖావాణి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మూడేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ నటికి వేర్వేరు కారణాల వల్ల ఆఫర్లు తగ్గాయి.

 Uttej Comments About Surekha Vani And Chiranjeevi Details, Uttej, Actor Uttej, C-TeluguStop.com

ఒక దశలో సురేఖావాణి కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదని వార్తలు ప్రచారంలోకి రాగా సురేఖావాణి ఆ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం.

సురేఖావాణికి భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉండగా ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ చిరంజీవి, సురేఖావాణికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చిరంజీవి ఫోటోల కోసం ఎగబడరని ఉత్తేజ్ అన్నారు.గరికపాటి గారు చిరంజీవిని ఆపాలి ఆపాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఉత్తేజ్ కామెంట్లు చేశారు.

చిరంజీవి దగ్గరకు జనం వెళ్లడాన్ని గరికపాటి తట్టుకోలేకపోయారని ఉత్తేజ్ అన్నారు.

Telugu Uttej, Chiranjeevi, Garikapati, Hitler, Surekha Vani, Tollywood-Movie

చిరంజీవి గారు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చారని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.హిట్లర్ మూవీ షూట్ సమయంలో చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చానని ఆ సమయంలో తెగ ఏడ్చానని ఉత్తేజ్ తెలిపారు.సురేఖావాణి ఎల్బీ స్టేడియంలో చిరంజీవిని ముట్టుకుని తెగ ఏడ్చారని చిరంజీవి అంటే అంతలా అభిమానం ఉంటుందని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.ఆయనతో ఫోటో అంటే అంత అభిమానం అని ఉత్తేజ్ తెలిపారు.

Telugu Uttej, Chiranjeevi, Garikapati, Hitler, Surekha Vani, Tollywood-Movie

గరికపాటి గతంలో పెళ్లైన ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడారని ఉత్తేజ్ కామెంట్లు చేశారు.చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఉత్తేజ్ అన్నారు.చిరంజీవి పండితులతో పాటు పామరులకు కూడా తెలుసని ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.ఫోటోకు ఉన్న వాల్యూ చిరంజీవికి తెలుసని ఉత్తేజ్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube