ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ విజయవంతం..సురక్షితంగా బయటపడ్డ కార్మికులు..!!

ఉత్తరాఖండ్( Uttarakhand ) ఉత్తర కాశీ జిల్లాలోని సిల్స్యారా టన్నెల్ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కూకు పోవటం తెలిసిందే.దాదాపు 17 రోజులపాటు టన్నెల్ లోనే కార్మికులు గడపడం జరిగింది.

 Uttarakhand Tunnel Operation Successful Workers Got Out Safely Details, Uttarak-TeluguStop.com

ఈ క్రమంలో పైప్ లైన్ ద్వారా ఆహారం, విటమిన్ టాబ్లెట్స్… ఆక్సిజన్ సరఫరా చేస్తూ వారిని కాపాడుకుంటూ వచ్చారు.సాంకేతిక కారణాలతో లోపలికి వెళ్లే పరిస్థితి మొన్నటివరకు లేదు.

ఈ క్రమంలో కూలిపోయిన సొరంగం( Tunnel ) కింద చిక్కుకున్న నిర్మాణ కార్మికులను బయటకు తీసుకురావడానికి సీనియర్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు.వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలలో భాగంగా ఎదురైనా కొన్ని ఇబ్బందులు కార్మికుల కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేశాయి.

సొరంగంలో డ్రిల్లింగ్ మిషన్ ద్వారా కూడా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా చేసిన రెస్క్యూ( Rescue Operation ) ఎంతో శ్రమించి చేసిన  ఆపరేషన్ లో 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగం నుండి బయటకు తీసుకురావడం జరిగింది.ఈ క్రమంలో టన్నెల్ నుంచి 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది వెంటనే వారిని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ కి తరలించడం జరిగింది.ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.17 రోజుల తర్వాత కార్మికులు సురక్షితంగా సొరంగం నుండి బయటపడటంతో కార్మికుల కుటుంబ సభ్యులు.సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube