అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడం లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సిద్ధహస్తులు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తోంది.
ఆ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి.మొన్నటివరకు హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్లు గా పోటీ ఉంటుందని ఊహించినా, కాంగ్రెస్ కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరింది.
హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకుంటున్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ వైపు చూస్తుండడంతో, ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు.

కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయకపోతే వేరే అభ్యర్థి అసలు తమకు పోటీనే కాదు అని లెక్కల్లో టిఆర్ఎస్ ఉంది.అయితే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ వైపు అడుగులు వేయడం వెనక మాజీ పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని , కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరి పోతారని, అసలు కౌశిక్ రెడ్డి ని వెనకుండి నడిపిస్తోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ప్రచారం ఇప్పుడు ఊపు అందుకుంది.వాస్తవంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఎప్పటి నుంచో కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం గానే ఉంటూ వస్తున్నారు.
ఆయన కాంగ్రెస్ కు సంబంధించిన కీలక అంశాలను టిఆర్ఎస్ కు చేరవేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారనే విషయాన్ని అనేకసార్లు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు అయితే కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉండడం తో ఆయనను తప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు సాహసించలేదు.

అయితే ఇప్పుడు రేవంత్ డైరెక్షన్ లో తాను నడిస్తే అది తనకు అవమానంగా భావిస్తున్న ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.అసలు కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ వైపు చూస్తున్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న, కాంగ్రెస్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినా, ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.