Ustaad Bhagat Singh : గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దీ.. గ్లాస్ అంటే కనిపించని సైన్యం.. పవన్ ఉస్తాద్ గ్లింప్స్ వేరే లెవెల్!

పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ అప్పట్లో సంచలనాలు సృష్టించగా ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతోంది.

ఈ సినిమా షూటింగ్ కేవలం ఐదు రోజులే జరిగినా 15 రోజులకు సరిపడా ఫుటేజ్ షూట్ చేశానని హరీష్ శంకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈరోజు భగత్స్ బ్లేజ్( Bhagats Blaze ) పేరుతో ఒక గ్లింప్స్ విడుదలైంది.ఈ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది.

గాజు గ్లాస్ ప్రధానంగా ఈ గ్లింప్స్ ఉండటం గమనార్హం.

విలన్ గాజు గ్లాస్ ను పగలగొట్టి నీ రేంజ్ ఇదీ అని చెప్పగా పవన్ కళ్యాణ్ "గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దీ" అంటూ పవన్( Pawan Kalyan ) చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది."కచ్చితంగా గుర్తుపెట్టుకో.గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.

Advertisement

కనిపించని సైన్యం" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది.ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) తాజా గ్లింప్స్ వేరే లెవెల్ లో ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ( Janasena Party )కి మరింత మైలేజ్ ఇచ్చేలా ఈ గ్లింప్స్ ఉంది.గ్లింప్స్ లోని డైలాగ్స్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన పార్టీ కోసం వాడుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

డీఎస్పీ( DSP Music ) బీజీఎం గ్లింప్స్ కు హైలెట్ అయింది.గబ్బర్ సింగ్ మ్యూజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా( Pithapuram ) పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని పవ్ఫన్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.ఫ్యాన్స్ నమ్మకాన్ని పవన్ నిజం చేస్తారేమో చూడాల్సి ఉంది.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   
Advertisement

తాజా వార్తలు