గూగుల్ మీట్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇక నుంచి ఆ సమస్యకు చెక్

కరోనా ప్రభావంతో ఆఫీసులు మూతపడటం, అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడంతో టెక్నాలజీ వినియోగం కూడా పెరిగిపోయింది.ఆఫీసుల్లో జరిగే టీమ్ మీటింగ్‌లు( Team Meetings ) ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

 Users Can Do More In Picture-in-picture Mode On Google Meet Details, Google Meet-TeluguStop.com

దీంతో జూమ్ లాంటి వీడియో కాలింగ్ యాప్‌లు అనేక వచ్చాయి.జూమ్ ఫ్లాట్‌ఫామ్ బాగా పాపులర్ అయింది.

దీని ద్వారా ఆఫీసుల మీటింగ్ లు సులువుగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది.ఎంతమందైనా సరే సింపుల్ గా జూమ్( Zoom ) ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు.

Telugu Google Meet, Googlemeet, Picture Picture, Tech-Technology Telugu

అయితే జూమ్ గా పోటీగా ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఒక వీడియో కాన్పరెన్స్ ఫ్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.అదే గూగుల్ మీట్.( Google Meet ) దీని ద్వారా ఎంతమందైనా సరే వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు.చాలా కంపెనీలు గూగుల్ మీట్ ను కూడా వీడియో కాన్పరెన్స్‌ల కోసం ఉపయోగిస్తున్నాయి.

అయితే గూగుల్ మీట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నారు.ఫీచర్లను అప్డేట్ చేస్తూ వస్తోన్నారు.

అందులో భాగంగా తాజాగా మరో ఫీచర్‌ను అప్డేట్ చేశారు.

Telugu Google Meet, Googlemeet, Picture Picture, Tech-Technology Telugu

పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్‌ను గూగుల్ మీట్‌లో తీసుకొచ్చారు.ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లో వేరే పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు గూగుల్ మీట్ ను మినిమైజ్ చేసుకోవచ్చు.దీని వల్ల గూగుల్ మీట్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ లో వేరే పనులు చేసుకోవచ్చు.మల్టీ టాస్కింగ్‌కు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.గూగుల్ మీట్ లో మీటింగ్ జరుగుతున్న సమయంలో స్క్రీన్ దిగువున ఉన్న ఎంపికల బటన్ పై క్లిక్ చేసి ఓపెన్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ను సెలక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత గూగుల్ మీట్ కుడివైపుకు మినిమైజ్ అవుతుంది.ఆ తర్వాత మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube