3 రోజులకు ఒకసారి ఈ హోమ్ మేడ్ మాస్క్ ను వేసుకుంటే మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం!

ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా ముఖం క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మెరుస్తూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.కానీ ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల అటువంటి చర్మాన్ని పొందడం అసాధ్యంగా భావిస్తుంటారు.

 Use This Homemade Mask To Get Spotless Glowing Skin ,glowing Skin, Spotless Skin-TeluguStop.com

కానీ సాధ్యమే.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మ్యాజికల్ మాస్క్ అద్భుతంగా సహాయపడుతుంది.

పైగా ఈ మాస్క్ ను రోజు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.మూడు రోజులకు ఒకసారి ఈ హోమ్‌ మేడ ఫేస్ మాస్క్ ను వేసుకుంటే మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలను వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్‌ సహాయంతో కొబ్బరిపాలను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి.

అలాగే చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక ఇర‌వై నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత షీట్ మాస్క్ ను అందులో ఒక నిమిషం పాటు ఉంచాలి.ఆపై షీట్ మాస్క్‌ను తీసుకుని ముఖంపై పెట్టుకోవాలి.కనీసం ముప్పై నిమిషాల పాటు ఈ మాస్క్ ను ఉంచుకుని.ఆపై వాటర్ తో శుభ్రంగా ముఖ చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

మూడు రోజులకు ఒకసారి ఈ హోమ్ మేడ్ ఫేస్‌ మాస్క్ ను వేసుకుంటే ముఖంపై ఎంతటి మొండి మచ్చలు అయినా మాయమవుతాయి.ముడతలు ఉంటే తగ్గు ముఖం ప‌ట్టి చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.అలాగే చర్మం కాంతివంతంగా షైనీ గా తయారవుతుంది.

ఎలాంటి మచ్చలు, మొటిమలు, ముడతలు లేకుండా ముఖం అందంగా ఆకర్షణీయంగా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube