సన్‌గ్లాసెస్ వల్ల ఒక కన్ను కోల్పోయిన యూఎస్ మహిళ... అదెలాగంటే..

కొన్ని సందర్భాలలో చాలా సురక్షితమైన వస్తువులే పెద్ద హాని కలిగిస్తుంటాయి.కొన్నిటి వల్ల ఎలాంటి హాని జరగదని అనుకుంటారు కానీ అదృష్టం బాగోలేకపోతే అవే జీవితాంతం బాధపడే పరిస్థితికి తీసుకురావచ్చు.

 Us Woman Who Lost An Eye Due To Sunglasses, Sunglasses, Car Accident, Eye Injury-TeluguStop.com

తాజాగా అలాంటి ఒక ఊహించని చేదు అనుభవం యూఎస్‌ మహిళకు ఎదురైంది.ఆమె తన సన్ గ్లాసెస్( Sunglasses ) కారణంగా కారు ప్రమాదంలో ఓ కన్ను కోల్పోయింది.

సులభంగా పగిలిపోయే అద్దాలు ధరించడం వల్ల ఆమెకు ఈ పరిస్థితి వచ్చింది.వాటి వల్ల కలిగే ప్రమాదం గురించి ఇతర డ్రైవర్లను హెచ్చరించడానికి ఆమె తన కథనాన్ని టిక్‌టాక్ లో పంచుకుంది.

2021లో తన కారు అకస్మాత్తుగా ఆగిన మరో కారును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పింది.ఆమె సమయానికి తన కారును ఆపలేకపోయింది.

గంటకు 25 మైళ్ల వేగంతో అతని కారును ఢీకొట్టింది.ఆ సమయంలో ఆమె ఖరీదైన డిజైనర్ సన్ గ్లాసెస్ ధరించింది.

ఎయిర్ బ్యాగ్ ( Air bag )బయటకు వచ్చి ఆమె సన్ గ్లాసెస్ పగలగొట్టింది.సన్ గ్లాసెస్ చాలా గాజు ముక్కలుగా పగిలిపోయాయి.

కాసేపటికి అపస్మారక స్థితికి చేరుకుందని, నిద్ర లేచి చూసే సరికి కన్ను పోయిందని తెలిపింది.కన్ను గాజు ముక్కల ద్వారా పగిలి కారిపోయింది.ఆ సమయంలో ఆమె కనురెప్ప కిందికి వేలాడుతోందట.దాంతో తనకు ఏమీ కనిపించలేదని అని చెప్పుకొచ్చింది.తన కన్ను గ్లాస్‌కు తగిలిందని, ఆప్టిక్ నరం, రెటీనా దెబ్బతిన్నాయని తెలిపింది.కంటిని సరిచేయడానికి ఆరు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది, కానీ ఆమె తన దృష్టిని తిరిగి పొందలేకపోయింది.

ఆమెకు ఇప్పుడు నకిలీ కన్నుతో బతుకుతోంది.

ఇతర వ్యక్తులు కూడా అదే విషయాన్ని నివారించడంలో సహాయపడటానికి తన కథను చెప్పాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.కొన్ని సన్ గ్లాసెస్ నైలాన్, ప్లాస్టిక్, గ్లాస్ వంటి సులభంగా పగిలిపోయే పదార్థాలతో తయారు చేయబడతాయని వెల్లడించింది.ఈ సన్ గ్లాసెస్ చాలా ప్రమాదకరమని, అవి పగిలిపోతే కళ్లకు హాని కలుగుతుందని వివరించింది.

బ్లూ ఐ అని పిలిచే పగిలిపోని సన్ గ్లాసెస్‌ని తయారు చేసే తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించానని ఆమె చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube