అమెరికా : మిస్సీస్సీప్పీలో టోర్నడోల బీభత్సం.. ఏడుగురు మృతి, భారీగా ఆస్తి నష్టం

అమెరికాలోని మిస్సీస్పీప్పీ రాష్ట్రంలో( Mississippi ) టోర్నడో బీభత్సం సృష్టించింది.ఎంఎస్ డెల్టాలోని గ్రామీణ ప్రాంతంపై శుక్రవారం విరుచుకుపడిన బలమైన టోర్నడో ( Tornado ) ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

 Us Tornado In Mississippi Kills At Least 7 More Trapped Details, Usa, Tornado ,m-TeluguStop.com

ఇక ఈ ప్రాంతంలో కురిసిన వడగండ్ల వర్షం( Hail Storm ) ప్రజలకు నష్టాన్ని మిగిల్చింది.ఇక్కడ పడిన వడగళ్లు గోల్ఫ్ బంతి సైజులో వున్నాయంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

మిస్సీస్సీప్పీకి ఈశాన్యంగా 60 మైళ్ల దూరంలో వున్న జాక్సన్‌లో టోర్నడో కారణంగా నష్టం ఎక్కువగా సంభవించిందని నేషనల్ వెదర్ సర్వీస్ స్పష్టం చేసింది.

సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్ గ్రామీణ పట్టణాల్లూ విధ్వంసం జరిగిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

టోర్నడో ఈశాన్య దిశగా 70 కిలోమీటర్ల వేగంతో వినోనా, అమోరీ పట్టణాల మీదుగా అలబామా వైపు దూసుకెళ్తోందని అధికారులు తెలిపారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, ప్రాణాలను కాపాడుకోవాలని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికలు జారీ చేసింది.

ఎగిరిపడే శిథిలాల నుంచి జాగ్రత్తగా వుండాలని.ఇళ్లు, వ్యాపార సముదాయాలు, వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Telugu Hail Storm, Mississippi, National, Fork, Silver, Tornado, Usa Tornado-Tel

టోర్నడో ధాటికి రోలింగ్ ఫోర్క్‌కు పశ్చిమాన వున్న షార్కీ ఇస్సాక్వెనా కమ్యూనిటీ హాస్పిటల్ దెబ్బతిన్నట్లుగా స్థానిక మీడియా తెలిపింది.అలాగే రోలింగ్ ఫోర్క్‌లోని షార్కీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం గ్యాస్ లీక్‌లు, శిథిలాల కుప్పల్లో చిక్కుకున్నట్లు నివేదించింది.షార్కీలోని కొన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాలు సైతం టోర్నడోలో చిక్కుకున్నట్లు మీడియా వెల్లడించింది.రోలింగ్ ఫోర్క్ పరిసర ప్రాంతాల్లోని పత్తి, మొక్కజోన్న, సోయాబిన్స్ పంటలు, క్యాట్ ఫిష్ చెరువులు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.

Telugu Hail Storm, Mississippi, National, Fork, Silver, Tornado, Usa Tornado-Tel

ఈ నేపథ్యంలో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు గాను రెస్య్కూ బృందాలు తాత్కాలిక షెల్టర్లను నిర్మిస్తున్నాయి.మరోవైపు.శిథిలాల తొలగింపు, ఇతర సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చురుగ్గా జరుగుతున్నట్లు మిస్సీస్సీప్పీ గవర్నర్ టేట్ రేవ్స్ శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు.బాధితులకు మరిన్ని అంబులెన్స్‌లు, అత్యవసర సహాయక సామాగ్రిని పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

శిథిలాల తొలగింపు తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube