2019లో తుపాకీకి 211 మంది బలి, అమెరికా చరిత్రలోనే అత్యథికం

ప్రజల రక్షణ కోసం అమెరికా ప్రభుత్వం ఇచ్చిన తుపాకులు ఉన్మాదుల చేతుల్లో గర్జించి అమాయకుల ప్రాణాలను తీస్తూనే ఉన్నాయి.గడచిన దశాబ్ధంలో ఎన్నడూ లేని విధంగా 2019లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రతి నిత్యం ఏదో ఒక మూల కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

 Us Saw Highest Number-TeluguStop.com

అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ఏ టుడే, సౌత్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా చేసిన పరిశోధనలో 2019లో అమెరికాలో 41 కాల్పుల ఘటనలు చోటు చేసుకుని 211 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.

సామూహిక కాల్పుల ఘటనల్లో నేరస్థుడు మినహా నలుగురు అంతకంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు.

మేలో వర్జీనియా బీచ్‌లో 12 మంది, ఆగస్టులో ఈఐ పాసోలో 22 మంది కాల్చి చంపబడటం ఈ ఏడాది జరిగిన ఘోరాల్లో దారుణమైనవిగా పరిశోధకులు పేర్కొన్నారు.కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా ఎనిమిది చోట్ల సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, లాస్‌వేగాస్‌లోని ఒక ఫెస్టివల్‌లో సందర్శకులపై ఉన్మాదులు కాల్పులు జరపడంతో 59 మంది మరణించారు.

Telugu American Gun, Mass, Telugu Nri Ups-

అమెరికా ప్రభుత్వం 2006 నుంచి కాల్పుల ఘటనలు నమోదు చేయడం ప్రారంభించింది.అయితే పరిశోధకులు మాత్రం 1970వ దశకంలోకి వెళ్లి.ఒక్కో ఏడాదిలో జరిగిన ఘటనలను పరిశీలిస్తూ వచ్చారు.ఈ లిస్ట్‌లో 2019 తర్వాత 2006లో 38 మంది తూటాలకు బలైనట్లుగా తేలింది.కుటుంబంలో వివాదాలు, గ్యాంగ్‌వార్, డ్రగ్స్ వినియోగం కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ప్రజలు వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లకూడదని, తప్పనిసరి పరిస్ధితుల్లో వెళ్లినప్పటికీ.

అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telugu American Gun, Mass, Telugu Nri Ups-

గతంతో పోలీస్తే అమెరికాలో హత్యల శాతం తగ్గినప్పటికీ.సామూహిక కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయని మిన్నెసోటాలోని మెట్రోపాలిటిన్ స్టేట్ యూనివర్సిటీలో క్రిమినాలజిస్ట్, ప్రొఫెసర్ జేమ్స్ డెన్ల్సీ తెలిపారు.అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణ ద్వారా ప్రజలకు తుపాకులపై యాజమాన్య హక్కులు కల్పించబడ్డాయి.

అయితే ఇటీవలికాలంలో సామూహిక కాల్పుల పెరుగుదల దృష్ట్యా ఈ చట్టంలో మార్పులు చేయాలని చట్టసభ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube