కమలా హారిస్ - డొనాల్డ్ ట్రంప్ డిబేట్.. ఎన్ని కోట్ల మంది వీక్షించారో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల చర్చా కార్యక్రమం వాడివేడిగా జరిగింది.డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ), రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

 Us Presidential Election Harris-trump Debate Tv Viewership Explodes , Kamala Ha-TeluguStop.com

తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్( Trump ) ముందు బైడెన్ నిలబడలేకపోవడంతో కమల ఆయనను ఎలా ఢీకొడుతుందోనని విశ్లేషకులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురూచూశారు.అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కమలా హారిస్ చెలరేగిపోయారు.

గర్భవిచ్చిత్తి హక్కులు, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, ప్రజాస్వామ్యంపై తన వాదనను వినిపించారు.ఆమె చెబుతున్న అంశాలపై ట్రంప్ కౌంటర్ ఇవ్వలేక తడబడ్డారు.

ఇష్యూని డైవర్ట్ చేయడానికి వ్యక్తిగత విమర్శలకు దిగారు.సెకండ్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో కమలా హారిస్ పైచేయి సాధించారని అమెరికన్ మీడియా అంటోంది.

Telugu Democratic, Hillary Clinton, Joe Biden, Kamala Harris, Trump, Presidentia

ఇదిలాఉండగా.కమలా హారిస్ – డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చా కార్యక్రమం వీక్షణలపరంగా కొత్త రికార్డులను సృష్టించింది.జూన్‌లో ట్రంప్ , అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) మధ్య జరిగిన చర్చా కార్యక్రమాన్ని 51 మిలియన్ల మంది వీక్షించగా.తాజా డిబేట్ దానిని మించిపోయింది.

జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులోంచి వైదొలిగిన తర్వాత కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి అయ్యారు.దీంతో కమలతో ట్రంప్ తొలిసారి ముఖాముఖి తలపడటంతో రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనించాయి.

Telugu Democratic, Hillary Clinton, Joe Biden, Kamala Harris, Trump, Presidentia

ట్రంప్ – హారిస్ డిబేట్‌ను 17 టీవీ నెట్‌వర్క్‌లలో 67.1 మిలియన్ల మంది వీక్షించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అయితే 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ – జో బైడెన్ మధ్య చర్చను వీక్షించిన 73 మిలియన్ల కంటే ఇది తక్కువ.దానికి ముందు హిల్లరీ క్లింటన్ ( Hillary Clinton )- డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చను రికార్డు స్థాయిలో 84 మిలియన్ల మంది వీక్షించారు.

డిబేట్ రోజున ఏబీసీ 19 మిలియన్ల మంది వీక్షకులతో ముందంజలో నిలిచింది.ఆ తర్వాత ఎన్‌బీసీని 10 మిలియన్లు, ఫాక్స్ న్యూస్‌ని 9 మిలియన్ల మంది .డిస్నీ యాజమాన్యంలోని వివిధ స్ట్రీమింగ్ సేవలపై 7 మిలియన్లకు పైగా వీక్షకులు ఈ డిబేట్‌ను వీక్షించారు.ఏబీసీ న్యూస్ ఛానెల్ ద్వారా హోస్ట్ చేయబడిన ఈ డిబేట్‌లో కమలా హారిస్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్నారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఇది హాట్ ట్రెండింగ్‌గా మారింది.ఆ వెంటనే టేలర్ స్విఫ్ట్ .కమలా హారిస్‌కు మద్ధతు పలకడం చర్చనీయాంశమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube