డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్.. ఒబామా మౌనం వెనుక..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) తప్పుకున్నారు.

అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలు, తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో తడబడటం సహా అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆయన వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వెళ్తూ వెళ్తూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌( Kamala Harris ) అభ్యర్ధిత్వానికి ఆయన మద్ధతు పలికారు.ఆ వెంటనే పలువురు ప్రముఖులు, డెమొక్రాటిక్ నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల గవర్నర్లు కమలా హారిస్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకించి భారత సంతతికి చెందిన నేతలు, కమ్యూనిటీ లీడర్లు కమలా హారిస్ రాకను స్వాగతించారు.త్వరలో జరగనున్న డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆమెను పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలాఉండగా.జో బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఇష్టపడని మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా( Barack Obama ).ఆయన పోటీ నుంచి తప్పుకుంటేనే మంచిదని సన్నిహితుల వద్ద ప్రస్తావించారు.కానీ డెమొక్రాటిక్ పార్టీ ( Democratic Party )నుంచి ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుందనే దానిపై మాత్రం ఒబామా క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

అయితే కమలా హారిస్ అధ్యక్ష రేసులో నిలవడం ఆయనకు ఇష్టం లేదంటూ అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఆమె అభ్యర్ధిత్వం విషయంలో డెమొక్రాట్ నేతలు ఏదో రకంగా స్పందించారు.

కానీ ఒబామా మాత్రం ఇప్పటి వరకు కమలా హారిస్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం చర్చనీయాంశమైంది.

అధ్యక్ష పదవికి కమలా హారిస్ సమర్ధురాలు కావడం లేదని మాజీ అధ్యక్షుడు భావిస్తున్నారని, సవాళ్లను దాటి ముందుకెళ్లడం కష్టమైన పనేనని ఒబామా అభిప్రాయపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.ఆమె స్థానంలో అరిజోనా సెనెటర్ మార్క్ కెల్లీని( Arizona Senator Mark Kelly ) అధ్యక్ష అభ్యర్ధిగా ఎంచుకుంటే బెటరనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తన అభిప్రాయాలు, ఉద్దేశాలను త్వరలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో బరాక్ ఒబామా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు