తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 95వ ఆస్కార్ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే.కాగా ఈ ఆస్కార్ అవార్డు ( Oscar Award )వేడుకలలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) కూడా పాల్గొంది.
ఇది అంతా బాగానే ఉంది కానీ అక్కడి మీడియా తీరు మాత్రం ఆమె అభిమానులకు కోపం తెప్పించేలా చేసింది.ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొణెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
అక్కడున్న వారిలో దీపికను ఎవరూ చూసిన ఇట్టే గుర్తు పట్టేస్తారు.

కానీ కొన్ని మీడియా సంస్థలు దీపికాను గుర్తించడంలో దారుణంగా విఫలమయ్యాయి.అంతేకాకుండా దీపికా పేరుకు బదులు మరో నటి కెమిలా ఏవ్స్( Camila Aves ) పేరును రాశారు.దీపికా పేరు స్థానంలో మరొకరి పేరు రావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.కాగా ఈ విషయంపై దీపికా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
దీపికా హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్ లలో దీపికా కూడా ఒకరు.

అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ లో 72 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే.అటువంటి దీపికాను గుర్తు పట్టకపోవడం దారుణమని అంటు విరుచుకు పడుతున్నారు.ఆ మీడియా సంస్థలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే దీపికా పదుకొనే విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.
అంతేకాకుండా బాలీవుడ్ లో అందం అభినయం కలగవలసిన హీరోయిన్లలో దీపికా పదుకొనే కూడా ఒకరు.







