యూఎస్ మెరైన్ కార్ప్స్‌పై ముగ్గురు సిక్కుల న్యాయపోరాటం.. గడ్డం, తలపాగాకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 Us Marine Corps Must Allow Sikh Recruits With Beards Turbans Us Court Orders Det-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.యూఎస్ మెరైన్ కార్ప్స్‌లో రిక్రూట్ అయిన సిక్కు సంతతి అభ్యర్ధులు గడ్డం, తలపాగా ధరించవచ్చని తీర్పు చెప్పింది.

శుక్రవారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు చెందిన న్యాయమూర్తులు తీర్పు సందర్భంగా మాట్లాడుతూ.Religious Freedom Restoration Act ప్రకారం జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం షేవ్ చేసుకోమని చెప్పడం మతపరమైన నియమాలను ఉల్లంఘించడమేనని తెలిపింది.

సిక్కు సంతతికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు ఏకాష్ సింగ్, జస్కిరత్ సింగ్, మిలాప్ సింగ్ చాహల్‌లు యూఎస్ మెరైన్స్ కార్ప్స్‌కు రిక్రూట్ అయ్యారు.అయితే వీరి గడ్డాలు, తలపాగాలపై మెరైన్ కార్ప్స్ అభ్యంతరం తెలిపింది.

సిక్కులు మతపరమైన గడ్డాలు ధరించి విధుల్లో పాల్గొనడం వల్ల సైనిక దళాల ఏకరూపత, రిక్రూట్‌లలో కనిపించే తీరుకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొంది.

Telugu Aekash Singh, Jaskirat Singh, Milaapsingh, Freedom, Sikh, Sikhsbeards, Fe

ఇది అంతిమంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని యూఎస్ మెరైన్ కార్ప్స్ వాదించింది.దీంతో ఈ ముగ్గురు Corps’ boot camp rule నిబంధన నుంచి తమకు తక్షణ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఫెడరల్ కోర్టులో అత్యవసర అప్పీల్ దాఖలు చేశారు.దీనిపై వీరి ముగ్గురి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎరిక్ బాక్స్‌టర్ మాట్లాడుతూ.

ఈ త్రయం ఇప్పుడు ప్రాథమిక శిక్షణలో పాల్గొనవచ్చునని చెప్పారు.ఇదిలావుండగా గతేడాది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.

అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాల్లో దాదాపు 100 మంది సిక్కులు.పూర్తిగా గడ్డాలు, తలపాగా ధరించే విధులు నిర్వర్తిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube