అమెరికాలో దారుణం జరిగింది.దోపిడి దొంగల చేతిలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.నిందితుడిని పాత్రో సిబోరామ్‌గా గుర్తించారు.
ఫిలడెల్ఫియాలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇతనిని ముగ్గురు దుండగులు హతమార్చారు.రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.అలాగే వారి ఆచూకీ తెలిపిన వారికి 20 వేల డాలర్ల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు.67 ఏళ్ల పాత్రో ఈశాన్య భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో జన్మించి, 1988లో అమెరికాకు వలస వచ్చాడు.పోలీసులు చెబుతున్న దానిని బట్టి.ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు దోపిడీ సమయంలో పాత్రోను చంపారు.
పెట్రోల్ స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో అనుమానితుల ఫోటోలను పోలీసులు సేకరించి మీడియాకు విడుదల చేశారు.యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం.
దుకాణాలు, పెట్రోల్ బంకులు వంటి వాణిజ్య ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులే అత్యధికంగా చంపబడుతున్నారు.అర్ధరాత్రి వేళల్లో తెరిచేవుండే పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో పనిచేసే భారతీయులు, ఇతర దక్షిణాసియా వాసులు తరచుగా దొంగల చేతిలో బలవుతున్నారు.
గతేడాది సెప్టెంబర్‌లో మిస్సిస్సిప్పిలోని టుపెలోలోని పెట్రోల్ బంకులో పరమ వీర్ సింగ్ అనే భారతీయుడు హత్యకు గురయ్యాడు.ఆ వెంటనే నవంబర్‌లో పాకిస్తాన్ జాతీయుడైన అలీ జుల్ఫికర్ న్యూయార్క్‌లోని ఒక పెట్రోల్ స్టేషన్‌లో హత్యకు గురయ్యాడు.
అదే నెలలో డల్లాస్ నగరంలో ఓ కేరళవాసిని దొంగ కాల్చి చంపాడు.మృతుడిని ఇక్కడి మెస్కైట్ స్ట్రిప్ షాపింగ్ సెంటర్‌లో బ్యూటీ సప్లై స్టోర్ నడుపుతున్న సాజన్ మాథ్యూస్ (56) అలియాస్ సాజీగా గుర్తించారు.ఆగంతకుడు దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్ వద్ద వున్న సాజీపై కాల్పులు జరిపాడు.స్ట్రిప్ షాపింగ్ సెంటర్‌లోని నార్త్ గాల్లోవే అవెన్యూలోని 1800 బ్లాక్‌లోని విక్టోరియాస్ బ్యూటీ సప్లై సెంటర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మాథ్యూస్‌ని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.కేరళ రాష్ట్రం కోజెంచేరికి చెందిన మాథ్యూస్ 2005లో కువైట్ నుంచి యూఎస్‌కి వలస వచ్చారు.డల్లాస్ సెహియోన్ మార్ థోమా చర్చిలో సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.మాథ్యూస్‌కి భార్య మినీ, ఇద్దరు పిల్లలు వున్నారు.మినీ డల్లాస్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్నారు.మాథ్యూస్ దారుణహత్య డల్లాస్‌లోని మలయాళీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.