భారతీయ కార్మికులతో వెట్టి చాకిరీ, లేబర్ చట్టాల ఉల్లంఘన: అమెరికాలో హిందూ సంస్థపై అభియోగాలు

అమెరికా… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.

 Us Hindu Group Accused Of exploiting Labourers Lured From India Report , America-TeluguStop.com

విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.

ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.

అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.

అలా ఎన్నో ఆశలతో భారత్ నుంచి వచ్చిన కార్మికులను వెట్టిచాకిరీ చేయించుకోవడంతో పాటు లేబర్ చట్టాలను ఉల్లంఘించినట్లుగా అమెరికాలోని హిందూ సంస్థ అభియోగాలను ఎదుర్కొంటోంది.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వున్న హిందూ ఆలయాల్లో ఈ సంస్థ వందలాది మంది కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నట్లుగా సమాచారం.

ఈ ఏడాది మేలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ (బీఏపీఎస్)పై మానవ అక్రమ రవాణా, వేతన చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ భారతీయ కార్మికుల గ్రూప్ యూఎస్ జిల్లా కోర్టులో దావా వేసింది.

బీఏపీఎస్.

భారత్ నుంచి అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ సమీపంలో దేవాలయాలలో పనిచేయడానికి వందలాది మంది కార్మికులను రప్పించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది.న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే దేవాలయంలో పనిచేస్తున్న వారికి నెలకు 450 డాలర్ల వేతనాన్ని చెల్లిస్తున్నారు.

సవరించిన కొత్త దావా ప్రకారం వందలాది మంది కార్మికులు శ్రమ దోపిడీకి గురయ్యారని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

మతపరమైన వీసాలపై 2018 నుంచి అమెరికాకు తీసుకొచ్చిన 200 మందికి పైగా భారతీయ పౌరులు .ప్రమాదకరమైన పరిస్ధితులలో పనిచేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.ఇండియా సివిల్ వాచ్ ఇంటర్నేషనల్ (ఐసీడబ్ల్యూఐ) మే నెలలో పీటీఐతో మాట్లాడుతూ.

మే 11 తెల్లవారుజామున ఎఫ్‌బీఐ నేతృత్వంలో దాడి చేసి దాదాపు 200 మంది కార్మికులను రక్షించినట్లు చెప్పింది.వీరిలో ఎక్కువ మంది దళితులు, ఆదివాసీలేనని తెలిపారు.న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలోని స్వామి నారాయణ ఆలయంలో వీరంతా విధులు నిర్వర్తించారు.

Telugu America, Atlanta, Chicago, Houston, Labor Laws, Los Angeles, Jersey, Robb

గత నెలలో సవరించిన కొత్త ఫిర్యాదు ప్రకారం బీఏపీఎస్ అధికారులు.రాష్ట్ర కార్మిక చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.తాజా ఫిర్యాదు మేరకు వెట్టిచాకిరీ, అక్రమ రవాణా, కుట్ర, విదేశీ కార్మిక కాంట్రాక్ట్‌లో మోసం, ఇమ్మిగ్రేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం, కనీస వేతనం చెల్లించడంలో వైఫల్యం వంటి కొత్త ఆరోపణలను దావాకు జత చేశారు.కార్మికులకు గంటలకు 1.2 యూఎస్ డాలర్లు చెల్లిస్తున్నారని.అయితే ప్రస్తుత యూఎస్ ఫెడరల్ నిబంధనల ప్రకారం గంటకు కనీస వేతనంగా 7.25 డాలర్లు చెల్లించాలి.

రోజుకు దాదాపు 13 గంటల పాటు పెద్ద రాళ్లను ఎత్తడం, క్రేన్‌లు, ఇతర భారీ యంత్రాలను ఆపరేట్ చేయడం, రోడ్లు, మురుగు కాలువలు నిర్మించడం, మంచును పారవేడం వంటి పనులను బాధితులు చేసేవారు.ఇందుకు గాను నెలకు 450 డాలర్లు చెల్లించేవారు.

ఇందులో 50 డాలర్లను నగదు రూపంలో ఇవ్వగా.మిగిలిన 400 డాలర్లను భారత్‌లోని కార్మికుల ఖాతాల్లో జమ చేసేవారు.

అయితే బీఏపీఎస్ అధికారులు.ఈ ఆరోపణలను ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube