CAA Act : భారత్‌లో అమల్లోకి సీఏఏ చట్టం.. అమెరికా ఆందోళన

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు పెండింగ్‌లో వుంచిన ‘‘పౌరసత్వ సవరణ చట్టం 2019 ’’ని( Citizenship Amendment Act 2019 ) అమల్లోకి తీసుకొచ్చింది.

 Us Concerned About Caa Implementation In India-TeluguStop.com

ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్చి 11న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో దేశవ్యాప్తంగా సీఏఏ అమల్లోకి వచ్చింది.

దీనిపై ముస్లిం వర్గాలు , సంస్థలు సహా పలు పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా( America ) స్పందించింది.

భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నోటిఫికేషన్ పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది.ఈ చట్టం అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్( Matthew Miller ) తెలిపారు.

అసలేంటీ సీఏఏ చట్టం :

Telugu America, Bjp, Caa, Citizenship, India, Matthew Miller, Muslims-Telugu NRI

సీఏఏ చట్టం ప్రకారం.మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ తదితర ముస్లింయేతర మైనారిటీలకు భారత పౌరసత్వం లభిస్తుంది.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 64 ఏళ్ల కిందటి భారత పౌరసత్వ చట్టం 1955ని సవరించింది.భారత పౌరసత్వం( Indian Citizenship ) పొందేందుకు దేశంలో 11 ఏళ్లు నివసించాలనే నిబంధనను సవరించింది.

అయితే ఇందులో ముస్లింలను( Muslims ) చేర్చకపోవడం వివాదానికి కారణమైంది.కేంద్రం నిర్ణయం రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించే ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయి.

Telugu America, Bjp, Caa, Citizenship, India, Matthew Miller, Muslims-Telugu NRI

ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని.బీజేపీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని తేల్చిచెప్పారు.ప్రతిపక్షాలకు వేరే పనిలేదని.వారు చెప్పది ఒకటి , చేసేది మరొకటని అమిత్ షా దుయ్యబట్టారు.కానీ మోడీ, బీజేపీ చరిత్ర వేరన్నారు.

మోడీ చెప్పారంటే అది రాతితో చెక్కినట్లేనని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube