డాలర్ డ్రీమ్స్ : దొడ్డిమార్గంలో అమెరికాకి .. పనామా అడవిలో కొట్టుమిట్టాడుతోన్న భారతీయ యువకుడు

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు( Pathankot in Punjab ) చెందిన 26 ఏళ్ల జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) అమెరికాలో స్థిరపడాలన్న కల ఇప్పుడు ప్రమాదంలో పడింది.

అక్రమ మార్గంలో అగ్రరాజ్యానికి వెళ్లి తన కల పండించుకోవాలని భావించిన అతను ఇప్పుడు పనామా అడవిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

మానవ అక్రమ రవాణా ముఠా ఎత్తయిన పర్వతాలు , విస్తారమైన చిత్తడి నేలల గుండా నెలల తరబడి నడవాల్సిందిగా అక్రమ వలసదారులను బలవంతం చేస్తారు.తద్వారా వీరిని అమెరికాలోకి దొడ్డిదారిన చేరుస్తారు.

జగ్మీత్ సింగ్ కేసుకు సంబంధించి కహ్నువాన్‌కు( Kahnuan ) చెందిన ట్రావెల్ ఏజెంట్లు పర్మీందర్ సింగ్( Parminder Singh ), అతని భార్య బల్విందర్ కౌర్‌లపై పఠాన్‌కోట్‌ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.జగ్మీత్‌ను నేరుగా అమెరికాకు పంపిస్తామని ఏజెంట్లు యువకుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

కానీ దీనికి బదులుగా అతనిని పనామా మీదుగా ‘Donkey route’లో పంపుతున్నారు.డిసెంబర్ 26న ఫ్రాన్స్‌లో అడ్డగించిన నికరాగ్వా వెళ్లే డాంకీ రూట్ విమానానికి జగ్మీత్ కేసుకు లింక్ వుండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

ఎస్ఎస్‌పీ దల్జీందర్ సింగ్ ధిల్లాన్ స్వయంగా కేసు దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్నారు.జగ్మీత్ సింగ్ తన తల్లిదండ్రులతో చివరిసారిగా డిసెంబర్ 19న మాట్లాడాడని, ఆ సమయంలో అతని లొకేషన్ పనామా అడవుల్లో గుర్తించామని ఎస్ఎస్‌పీ వెల్లడించారు.

నికరాగ్వా ఎస్కేప్‌ని ప్లాన్ చేసిన ఏజెంట్‌లతో పఠాన్‌కోట్‌‌లోని ట్రావెల్ ఏజెంట్లకు లింక్ వుందా లేదా అన్న దానిపై ఆరా తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.జగ్మీత్‌ ఎక్కడ వున్నాడనే దానిపై ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని దల్జీందర్ తెలిపారు.తాను అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు జగ్మీత్ తన తండ్రి జోగిందర్ సింగ్‌కు తెలిపాడు.దీంతో జోగిందర్ ట్రావెల్ ఏజెంట్ జంటతో రూ.45 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అందులో రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారని, అనంతరం జగ్మీత్‌ గయానా వెళ్లే విమానం ఎక్కాడని, అక్కడి నుంచి అతను సురక్షితంగా యూఎస్ చేరుకుంటాడని ఏజెంట్ చెప్పారని జోగిందర్ మీడియాకు తెలిపాడు.కానీ జగ్మీత్ తమకు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి పనామా వెళ్లేందుకు బలవంతంగా ఫ్లైట్ ఎక్కిస్తున్నాడని చెప్పాడని వెల్లడించాడు.

తిరిగి డిసెంబర్ 19న మా అబ్బాయి తనకు ఫోన్ చేసి లొకేషన్ పంపించాడని, అది పనామా అడవి అని తేలిందని జోగిందర్ కన్నీటి పర్యంతమయ్యారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు