అమెరికా అధ్యక్ష ఎన్నికలు: నేడు మరోసారి ఓట్ల లెక్కింపు.. ఇలా ఎందుకు చేస్తారంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ మొదటి వారంలోనే ముగిసిన సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కోర్టుల చుట్టూ తిరిగి మొట్టికాయలు వేయించుకున్నారు ట్రంప్.

ఓటమిని అంగీకరించి శాంతియుతంగా అధికార బదలాయింపు జరిగేందుకు సహకరించాలని ఆయనకు సొంత పార్టీ నేతలతో పాటు డెమొక్రాట్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు హితవు పలికారు.కానీ ట్రంప్ ససేమిరా అంటున్నారు.

చివరి 14 రోజుల్లో తాను చేయగలిగినంతా చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఓట్లను పెంచి త‌న‌నే విజేత‌గా ప్రకటించాలంటూ ఓ అధికారితో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఈ పరిణామంతో అధ్యక్ష ఎన్నిక ఓట్లను మరోసారి లెక్కించనున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగాయి.

Advertisement

ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ డిసెంబర్ 14 న జరిగింది.జో బైడెన్‌‌కు 306 ఓట్లు, డొనాల్డ్‌ ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి.

ఈ నెల 20 కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రమాణం స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు లెక్కించాలని అమెరికా ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

లెక్కింపు పూర్తయిన తర్వాత అధ్యక్షుడిగా గెలిచిన వ్యక్తి పేరును అధికారికంగా మరోసారి ధ్రువీకరిస్తారు.అధ్యక్షుడిగా ప్రమాణం చేసే రోజునే ఇనాగురేషన్‌ అని కూడా పిలుస్తుంటారు.

అనంతరం సెనేట్‌, ప్రతినిధుల సభ సంయుక్తంగా సమావేశం జరుగుతుంది.దీనికి ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ అధ్యక్షత వహిస్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉండగా.. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులు వున్నారు.

Advertisement

ఈ సంయుక్త సమావేశం ప్రతినిధుల సభ భవనంలో జరుగుతుంది.నవంబర్ 3 న జరిగిన అధ్యక్షుడి ఎన్నికతోపాటు ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులు, సెనేట్‌లో మూడో (33) వంతు సభ్యులు కూడా కొత్తగా ఎన్నికయ్యారు.

నూతన అధ్యక్షుడి ప్రమాణం స్వీకారానికి ముందు ఎంపీలు ప్రమాణం చేస్తారు.అనంతరం రాజ్యాంగబద్ధంగా కాబోయే అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.

ప్రతి రాష్ట్ర బ్యాలెట్ పెట్టెలు అక్షర క్రమంలో తెరుస్తారు.ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారో వెల్లడిస్తూ లెక్కింపు ప్రక్రియను పూర్తిచేస్తారు.

ఒకవేళ అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా 269-269 ఓట్లు వచ్చినట్లయితే.పార్లమెంటు కంటింజెంట్‌ ఎన్నికలను నిర్వహిస్తారు.

దీనికి కూడా ఒక విధానం వుంది.అధ్యక్షుడి ఎన్నికలను ప్రతినిధుల సభ, ప్రతినిధుల సభ ఉపాధ్యక్షుడు నిర్ణయించకపోతే.

అప్పుడు సెనేట్ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకుని అక్కడ ఓట్లు లెక్కిస్తారు.అమెరికా అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఒక ఓటు ఉంటుంది.

అంటే 50 రాష్ట్రాలకు 50 ఓట్లు.వీటిలో 26 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి విజయం సాధించినట్లు.ఇక ఉపాధ్యక్షుడి ఎన్నిక విషయానికి వస్తే సెనేట్‌లోని 100 మంది సభ్యులు ఓటు వేస్తారు.51 ఓట్లు పొందినవారు గెలుస్తారు.ఈ విధంగా 1836లో ఒకసారి జరిగినట్లు అమెరికా రికార్డులు చెబుతున్నాయి.

తాజా వార్తలు