సినిమాకు చెందిన నటి నటులు రాజకీయాల్లో కీలక పాత్రను పోషించే వ్యక్తులుగా కొనసాగుతున్నారు.సినిమాల్లో ప్రేక్షక ఆధారణ సంపాదించిన తరువాత రాజకీయాలోకి ప్రవేశించి తమ అదృష్టంను పరీక్షించుకుంటారు.
తెలంగాణ కు చెందిన విజయ్ శాంతి కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలుగా ఉన్నారు.తమిళ్ నాడు కు చెందిన కుష్భు కూడా కొంతకాలం కాంగ్రెస్ పార్టీ లో ఆక్టివ్ గా ఉంటూ మొన్న ఈ మధ్యనే బిజేపి పార్టీలోకి జంప్ చేశారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి సినిమా రాజకీయనాయకులు వెళ్ళడం సహజం.ఇక బాలీవుడ్ ఊర్మిళా మటోండ్కర్ కూడా శివ సేన పార్టీ లో చేరారు.

మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, థాక్రే కుటుంబ సబ్యులు మాత్రమే హాజరు అయ్యారు. ఊర్మిళా పై గతంలో కూడా పార్టీ మారబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కానీ అవన్నీ వట్టి గాలి వార్తాలేని ఊర్మిళా కొట్టివేసింది.ఊర్మిళా మటోండ్కర్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లి ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓటమి చెందారు అప్పటినుండి సైలెంట్ గా ఉన్న ఊర్మిళా సడెన్ గా పార్టీ మారడంతో కాంగ్రెస్ కు ఊహించని దెబ్బ తగిలింది.