కొండకు నిచ్చన వేస్తే ఎదురు చూపులు తప్పవు బుచ్చిబాబు అన్న.. ఆగడం మంచిదే కదా!

Uppena Director Buchibabu Waiting For His Next Film , Uppena Director Buchibabu,Buchibabu,NTR, Ram Charan, Sukumar, Uppena

ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెన తోనే సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ కు పైగా నమోదు చేయడంతో బుచ్చిబాబు తదుపరి సినిమా ఏంటి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Uppena Director Buchibabu Waiting For His Next Film , Uppena Director Buchibabu,-TeluguStop.com

ఆ మధ్య బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించేందుకు ఓకే చెప్పాడంటూ ప్రచారం జరిగింది.ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా నడిచాయి.

బుచ్చిబాబు చెప్పిన కథ కు ఎన్టీఆర్ ఓకే చెప్పడం కూడా జరిగిందంటూ వార్తలు వచ్చాయి.కానీ ఎన్టీఆర్ ముందుగా కమిట్ అయిన సినిమాల కారణంగా బుచ్చి బాబుతో వెంటనే సినిమాని చేసేందుకు డేట్లు ఇవ్వలేక పోయాడు.

దాంతో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయలేక ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని బుచ్చిబాబు కలిసిన విషయం తెలిసిందే.ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా కన్ఫర్మ్ అయింది.

Telugu Buchibabu, Ram Charan, Sukumar, Uppena-Movie

అధికారికంగా ప్రకటన రాలేదు కానీ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా దాదాపుగా కన్ఫామ్ అయ్యింది, కానీ ఆ సినిమా ప్రారంభానికి కూడా మరో ఏడాది సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటూ మెగా కాంపౌండ్ నుండి వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ డేట్ లు ఇవ్వడం ఆలస్యం చేస్తుండడంతో దర్శకుడు బుచ్చిబాబు అసహనం వ్యక్తం చేస్తున్నాడట.

Telugu Buchibabu, Ram Charan, Sukumar, Uppena-Movie

మరో హీరోతో సినిమా ను చేసేందుకు దర్శకుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నాడని పుకార్లు షికారులు చేస్తున్నాయి.కొండకు నిచ్చెన వేసిన బుచ్చిబాబు వారి నుండి స్పందన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.వారిచ్చే డేట్స్ కోసం ఆగాల్సిందే.హడావుడిగా ఒక్కసారి కొండ ఎక్కేస్తా అంటే కుదరదు.రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే మాత్రం బుచ్చిబాబు మరికొన్ని ఆగడం మంచిది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube