ఈ దీపావళి పండుగకు థియేటర్లు, ఓటీటీలలో దద్దరిల్లే అద్భుతమైన సినిమాలు ఇవే!

ఇటీవలె దసరా పండుగకు పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇక నవంబర్ 11న దీపావళి పండుగకు కానుకగా పెద్దపెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యి బాక్సాఫీస్( box office ) వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి.

 Upcoming Telugu Movies Diwali 2023, Jigar Tanda Double X, Japan, The Marvels Ame-TeluguStop.com

ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన చిత్రం జపాన్( Japan ).ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా నవంబర్ 10న దీపావళి పండుగ కానుకగా విడుదల కానుంది.

అలాగే రాఘవ లారెన్స్‌, ఎస్‌.

జె.సూర్య కీలక పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ రూపొందిస్తున్న చిత్రం జిగర్‌( jiger ) తండా డబుల్‌ ఎక్స్‌.ఈ మూవీ దీపావళి కానుకగా ఈ మూవీ కూడా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.దినేశ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం అలా నిన్ను చేరి.

హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు.ఈ మూవీకి మారేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో( The Marvels are American superheroes ) సినిమా.

మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది.

Telugu Japan, Rainbow Rishta, Marvelsamerican, Tiger-Movie

నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.రాము వెంకట్, దీపన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దీపావళి.రా వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మనీష్‌ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం టైగర్‌3( Tiger 3 ).ఇందులో కత్రినా కైఫ్‌ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Telugu Japan, Rainbow Rishta, Marvelsamerican, Tiger-Movie

ఇకపోతే ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాల వెబ్‌సిరీస్‌ల విషయానికి వస్తే.అమెజాన్‌ ప్రైమ్‌ లో రెయిన్‌ బో రిష్టా ( Rainbow Rishta )అనే ఇంగ్లీష్‌ మూవీ నవంబరు 7 న విడుదల కానుంది.బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ అనే కొరియన్‌ మూవీ నవంబరు 9 స్ట్రీమింగ్ కానుంది.పిప్పా అనే హిందీ హిందీ సిరీస్ నవంబరు 10 న విడుదల కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ విడుదల అయ్యే సినిమాల విషయానికొస్తే.ఇరుగుపట్రు అనే తమిళం మూవీ నవంబరు 6 న స్ట్రీమింగ్ కానుంది.

  ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ అనే వెబ్‌సిరీస్‌ నవంబరు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.రాబీ విలియమ్స్‌ అనే వెబ్‌సిరీస్‌ నవంబరు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అలాగే ది కిల్లర్‌( The Killer ) అనే హాలీవుడ్‌ మూవీ నవంబరు 10న విడుదల కానుంది.ది రోడ్‌ అనే తమిళం మూవీ నవంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ+హాట్‌స్టార్‌ విడుదల అయ్యే వెబ్ సిరీస్ లు సినిమాల విషయానికి వస్తే.ది శాంటాక్లాజ్స్‌ అనే వెబ్‌సిరీస్‌2 నవంబరు 8 స్ట్రీమింగ్ కానుంది.విజిలాంటి కొరియన్‌ మూవీ నవంబరు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.అదేవిదంగా లేబుల్‌ అనే తెలుగు మూవీ నవంబరు 10న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube