ఉపాసన క్రిస్మస్ డ్రెస్ ఖరీదు తెలుసా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

సెలెబ్రిటీలు అన్నాక వారు వాడే ప్రతి వస్తువు కూడా వైరల్ గానే మారుతుంది.

వారు వాడే బట్టల దగ్గర నుండి వారు వెళ్లే వెకేషన్ వరకు అన్నిటిని పెద్ద విషయంగా చెప్పుకుంటూ ఉంటారు.

సినీ ప్రేక్షకులు సైతం వారు వాడే బ్రాండ్ ఏంటో.అది ఎంత ఖరీదో తెలుసు కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఈ విషయాలన్నిటిపై ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.మన టాలీవుడ్ లో బ్రాండెడ్ వస్తువులు వాడే వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కూడా ఒకరు.

ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే  సమాజంలో చైతన్యం కలిగించే విషయాలు కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెల్పుతూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది.ఈమె సమాజంలో జరిగే విషయాలను మాత్రమే కాదు  తన కుటుంబ విషయాలు కూడా ఎప్పటికప్పుడు మెగా అభిమానులతో పంచుకుంటారు.

Advertisement

ఉపాసన సాధారణంగా ఉండడానికే ఇష్టపడినప్పటికీ ఏదైనా అకేషన్ సమయంలో ఎక్కువ ఖరీదు అయిన దుస్తులను వాడుతూ ఉంటుంది.

తాజాగా ఈమె క్రిస్మస్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంది.ఈ పండుగకు ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిసి అందరు నోరెళ్లబెడుతున్నారు.2021 క్రిస్మస్ కోసం ఉపాసన డోల్స్ అండ్ గబ్బానా నుండి సెల్ఫ్ టై బోతో చారల సిల్క్ మిడి దుస్తులను వేసుకుంది.

అయితే తాజాగా ఈ డ్రెస్ ఖరీదు ఎంతో బయటకు వచ్చింది.దీని ధర 2.5 లక్షలు అని తెలిసి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో ఈమెతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు.

వీరిద్దరూ డాషింగ్ లుక్ లో అందంగా కనిపిస్తున్నారు.ఇక మరొక వైపు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు