పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం బ్రో( Bro ) .ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా వేడుకకు మెగా హీరోలు ( Mega Heroes ) అందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అదే విధంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.ఈ వేడుకకు పవన్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ ఈయన సుదీర్ఘమైన స్పీచ్ తో అందరిని మెప్పించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.రాజమౌళి ( Rajamouli ) తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు.ఆయన స్ఫూర్తితోనే యువ దర్శకులు అందరూ కూడా మరిన్ని మంచి సినిమాలతో ముందుకు రావాలని ఈయన పిలుపునిచ్చారు.ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్(NTR) రామ్ చరణ్ ( Ramcharan ) మాదిరి డాన్స్ చేయకపోవచ్చు ప్రభాస్( Prabhas ) లాగా ఏళ్ల తరబడి సినిమాలు చేయకపోవచ్చు.
రానా(Rana) లా బాడీ బిల్డప్ చేయకపోవచ్చు కానీ నేను కూడా సినిమాల కోసం కష్టపడుతున్నాను.

ఇక సినిమాల కోసం నేను కష్టపడేటమే కాకుండా నా సినిమాలు ఇతర హీరోల సినిమాల కంటే బాగా ఆడాలని కూడా తాను కోరుకుంటానని తెలిపారు.బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే కూడా నా సినిమా బాగా ఆడాలని నేను కోరుకుంటాను.ఇండస్ట్రీలో ఆ పోటీ తత్వం లేకపోతే సినిమాలో క్వాలిటీ రాదు.
అందుకే కష్టపడి పని చేయాలని తాను కోరుకుంటాను.అలాగే అందరి హీరోలకు కూడా మంచి సక్సెస్ లు రావాలని కోరుకుంటానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







