తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇక వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పాదయాత్ర అస్త్రాన్ని ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ఇందుకు షర్మిల పార్టీ కూడా ఏమీ తీసిపోలేదని చెప్పవచ్చు.
అయితే రెండో విడత ప్రజాప్రస్థాన యాత్రను మొదలు పెట్టిన షర్మిల ఇక కెసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ముందుకు కదులుతున్న విషయం తెలిసిందే.అయితే అసలు ఏ మాత్రం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని షర్మిల అంతేకాక తెలంగాణ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా నిలదొక్కుకోవడానికి పాదయాత్రల పేరుతో రాజకీయం చేయడం ఉద్యమ కారులకు ఆగ్రహం తెప్పిస్తున్నా కాస్త సంయమనం పాటిస్తున్న పరిస్థితి ఉంది.
తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పార్టీకూడా షర్మిల పార్టీని ఒక రాజకీయ పార్టీగా పరిగణించకపోవడం అనేది షర్మిలకు కాస్త మింగుడుపడని అంశమైనా ఒకవేళ షర్మిల పార్టీని రాజకీయ పార్టీగా గుర్తిస్తే ఇతర రాజకీయ పార్టీలు కెసీఆర్ చేతిలో పెద్ద ఎత్తున రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంది.అందుకే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా షర్మిలపై వ్యాఖ్యలు చేయడం కాని ఏమీ చేయడం లేదు.
అయితే ఎంతగా పాదయాత్రలు చేసినా తెలంగాణలో కెసీఆర్ రాజకీయ వ్యూహాలను షర్మిల ధీటుగా ఎదుర్కొంటుందా అంటే లేదనే చాలా మంది నుండి సమాధానం వినిపిస్తుంది.

అయితే రాజకీయంగా షర్మిల నిలదొక్కుకోవడానికే పాదయాత్ర నిర్వహిస్తోన్నదని ప్రజలు అదరించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే మొదటి నుండి ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగానే కెసీఆర్ పై విమర్శల జోరు పెంచుతూ ముందుకెళ్తున్నా ఎన్నికల సమయంలో వీరందరి విమర్శలపై సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.మరి షర్మిల రాజకీయంగా ఎంత మేర సత్తా చాటుతుందనేది చూడాల్సి ఉంది.







