టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అగ్ర హీరో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.అయితే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడు ప్రసారమవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
అయితే తాజాగా ఫిబ్రవరి 2 గురువారం రాత్రి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే పవన్ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అది ఎంతలా అంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన 14 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది.

దాంతో ఆహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది.పవన్ బ్లాక్ చొక్కా వేసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ ఆహా యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసింది.అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ 2 ని ఫిబ్రవరి 10 ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు.ఇకపోతే టాలీవుడ్ లో నందమూరి హీరోలు మెగా హీరోల మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే.
అది కేవలం సినిమాల వరకు మాత్రమే అని బయట అందరూ ఒకటే రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని అన్‌స్టాపబుల్ షోతో నిరూపించారు బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్.

మొదటి ఎపిసోడ్ సినిమాలు, పెళ్లిళ్ల గురించి అలాగే కామెడీ విషయాల గురించి పర్సనల్ విషయాలు గురించి చర్చించిన బాలయ్య బాబు రెండవ ఎపిసోడ్లో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తారేమో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే మొదటి ఎపిసోడ్ బాగా సరదా సరదాగా సాగిన విషయం తెలిసిందే.రెండవ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
రెండవ ఎపిసోడ్ ప్రారంభం కావాలి అంటే మరి కొద్ది రోజులు వేసి చూడాల్సిందే మరి.







