కనీవినీ ఎరుగని సైజులో అరటిపండు.. ఒక్కొక్కటి మూడు కిలోలు

మనం తినే అరటి పళ్లు( Bananas ) సాధారణంగా 7 లేదా 8 ఇంచుల పొడవు ఉంటాయి.చక్కెరకేళి, బుషావళి, కర్పూరం, ఎర్ర కర్పూరం ఇలా రకరకాల అరటి పళ్లు ఉంటాయి.

 Unprecedented Size Of Banana.. 3 Kg Each ,banana ,7 Feet Banana, Latest News, V-TeluguStop.com

వాటి రకం బట్టి సైజులు ఉంటాయి.అయితే ఏదైనా అరటి పండు మన అరచేతి కంటే పెద్దగా ఉంటుందని భావించారా.

కానీ ఇది నిజం.ఈ భారీ అరటి పండు ఒక్కోటి 3 కిలోల బరువు ఉంటుంది.

మనం విందు భోజనాలు పెట్టుకున్నప్పుడు ఆహారంతో పాటు అరటి పండు కూడా అతిథులకు పెడుతుంటాం.కానీ ఈ జంబో అరటి పండు ( Jumbo banana )తింటే ఇక అన్నం తినలేరు.

ఆ స్థాయిలో ఇది ఉంటుంది.ప్రపంచంలో అతిపెద్ద అరటి మొక్క జెయింట్ హైలాండ్ బనానా (మూసా ఇంజెన్స్)కు ఈ అరటి పళ్లు కాస్తాయి.

ఈ చెట్లు ఇది 50 అడుగుల ఎత్తు (15 మీటర్లు) వరకు పెరుగుతుంది.

మూసా ఇంజెన్స్ చెట్లు 300 అరటి పండ్లను కలిగి ఉంటుంది.అరటిపండ్లు 15 మీటర్ల పొడవు గల కాండం మీద పెరుగుతాయి.ఈ అరటి పళ్లు కేవలం పాపువా న్యూ గినియా, ఇండోనేషియాలోని కఠినమైన పర్వత శ్రేణులలోనే కనిపిస్తాయి.

అరటి పండ్లు సాధారణంగా 7 అంగుళాలు (18 సెం.మీ) పొడవు ఉంటాయి కానీ ఈ భారీ అరటి పండ్లు మాత్రం 11.8 అంగుళాల పొడవు (30 సెంటీమీటర్లు) వరకు పెరుగుతాయి.జెయింట్ హైలాండ్ బనానా కావెండిష్ అరటి వంటి గోధుమ రంగు గింజలతో ఉంటాయి.

తీపి, పులుపు కలిసిన రుచితో ఇవి ఉంటాయి.మూసా ఇంజెన్స్ అరటిలో అత్యంత ఎత్తైన జాతి.

ఒక పరిశోధకుడు, జెఫ్ డేనియల్స్, 1989లో ఈ మొక్కను కనుగొన్నారు.సముద్ర మట్టానికి 1000 నుంచి 2000 మీటర్ల మధ్య ప్రాంతంలో ఇవి పెరుగుతాయి.

నిటారుగా ఉన్న లోయలలో లేదా పర్వత చిత్తడి నేలల అంచులలో, తేమతో కూడిన ప్రదేశాలలో ప్రబలంగా పెరుగుతుంటాయి.మూసా ఇంజెన్స్ పెరగడం అంత సులభం కాదు.

వాటి కోసం వర్షారణ్య వాతావరణాన్ని పునఃసృష్టి చేయడం కష్టం.అయినప్పటికీ, అనేక మంది విక్రేతలు ఈ పండ్లను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube