ఇక అనవసరం ! బీజేపీ పై టీడీపీ ఇలా డిసైడ్ అయ్యిందా ?

ఏపీలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశం కీలకంగా మారింది.అధికార పార్టీ వైసిపి తాము ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ఇప్పటికే ప్రకటించింది.

 Unnecessary! Has Tdp Decided On Bjp Like This? , Tdp Decided On Bjp Like This?-TeluguStop.com

దమ్ముంటే మిగతా పార్టీలు విడివిడిగా పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలంటూ వైసీపీ సవాల్ చేస్తున్నా, పొత్తులు లేకుండా వైసిపి తో పోటీపడితే తమకే నష్టమనే అభిప్రాయంతో టిడిపి, జనసేన, బిజెపిలో ఉన్నాయి.ప్రస్తుతం బిజెపి జనసేనలు( BJP ) పొత్తు కొనసాగిస్తుండగా, టిడిపి కూడా ఆ రెండు పార్టీలతో జత కట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటూ బిజెపి హై కమాండ్ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.తమతో పాటు, టిడిపిని కూడా కలుపుకు వెళ్తే ఏపీలో తమకు తిరుగుండదని, వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే లెక్కలతో బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న, టిడిపి విషయంలో మాత్రం బిజెపి పెద్దలు తమ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా కనిపించడం లేదు.

Telugu Ap Bjp, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pawan Kalyan, Telug

ఒకపక్క వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే, కేంద్ర బిజెపి పెద్దలు అన్ని విధాలుగా ఏపీ ప్రభుత్వానికి సహకారం అందిస్తూ వస్తూ ఉండడం వంటి వాటిపై టిడిపి గత కొద్ది రోజులుగా విశ్లేషణ చేసుకుంటుంది.ఎవరు అవునన్నా, కాదన్నా, వైసిపి ( YCP )కి బిజెపి కేంద్ర పెద్దలు మద్దతు పలుకుతూనే వస్తున్నారని, ఆ పార్టీతో పొత్తు కోసం ఇంకా వెంపర్లాడడం అనవసరం అనే భావనకు టిడిపి పెద్దలు వచ్చారట.తాము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, తమ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి సిద్ధంగా లేకపోవడం, అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడం వంటి వాటిని లెక్కలు వేసుకుని జనసేనతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుందట.

Telugu Ap Bjp, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pawan Kalyan, Telug

ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన( Jana sena ) చేజారిపోకుండా జాగ్రత్తలు పడుతుందట.ఇటీవల కేంద్రం ఏపీ ప్రభుత్వానికి పదివేల కోట్లకు పైగా నిధులు ఇవ్వడంతో, ఇంతకన్నా సహకారం ఏం ఉంటుంది అనే అభిప్రాయంలో టిడిపి ఉంది.గత టిడిపి ప్రభుత్వంలో నిధులు ఇచ్చేందుకు అనే కొర్రీలు పెట్టిన అప్పటి బిజెపి ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం వైసిపి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడం, ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా పదివేల కోట్లు మంజూరు చేయడం వంటి వాటిని టిడిపి చాలా సీరియస్ గానే తీసుకుంది.

ఇక పొత్తుల కోసం బిజెపిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినా, అనవసరమే అన్న అభిప్రాయంలో టిడిపిలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube