ఆ దేశంలో ఇకనుండి పెళ్లి కాకుండానే బిడ్డను కనేయొచ్చు... లోకల్ స్టేట్మెంట్?

ఏంటీ.పెళ్లి కాకుండానే బిడ్డను కనేయడమా? ఇదెక్కడి విచిత్రం? అని ఆశ్చర్యపోకండి మిత్రులారా.

మన పొరుగున వున్న డ్రాగన్ కంట్రీ చైనాలో బర్త్‌ రేట్‌ రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది.అదేంటిది? అత్యధిక జనాభా ఆ దేశంలోనే వున్నారు కదా? వారికి ఏం పోయేకాలం? అని అనుకుంటున్నారా? అక్కడ జననాల సంఖ్య రోజురోజుకీ పడిపోగా, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.ఎందుకంటే అక్కడ యువత కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా వుంది.

ఇక యువతయితే సరిగ్గా సెటిల్ కాని కారణంగా వివాహాలు చేసుకోవడమే లేదు.అందుకే అక్కడ జననాల్లో క్షీణత స్ఫష్టంగా కనిపిస్తోంది.

ఆ కారణంగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ బిడ్డల్ని కనే విషయంలో కొన్ని ఆంక్షల్ని తాజాగా సడలించడం కొసమెరుపు.అదేమంటే పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కనొచ్చనేది సారాంశం.అంతే కాదండోయ్.

వివాహితులు పొందే ప్రయోజనాలు కూడా వీరు పొందడానికి అనుమతించనున్నట్లు ఓ ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది.ఇంతకుముందు ఉన్న నిబంధన ప్రకారం పెళ్లి అయిన వారు మాత్రమే లీగల్‌గా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉంది.

Advertisement

కానీ, ఇప్పుడు ఆ నిబంధన సడలించనున్నారని స్పష్టం అవుతోంది.

పెళ్లి కాని సింగిల్‌ పర్సన్ పిల్లలు ఇక కావాలనుకుంటే ఆ నిబంధన కింద ఫిబ్రవరి 15 నుంచి అనుమతి లభించనుంది.అందుకు సిచువాన్ అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం వుంది.అలాగే ఎంతమంది పిల్లల్ని కనాలనే సంఖ్య విషయంలో కూడా ఎలాంటి పరిమితి ఉండకపోవడం అమనార్హం.

దీర్ఘకాలిక, సమతుల్యతతో కూడిన పాపులేషన్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సిచువాన్ ఆరోగ్య కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?
Advertisement

తాజా వార్తలు