అన్నగారి ఆప్తమిత్రుడు.. ఆయనకు వ్యతిరేకంగా సినిమా తీశాడు.. ఈ స్టోరీ మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా బహుముఖ ప్రజ్ఞ చాటారు.అంతేకాదు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులను కూడా పరిచయం చేశారు ఆయన.

 Unknown Facts Between Senior Ntr And Actor M Prabhakar Reddy Details, Unknown Fa-TeluguStop.com

ఇక నందమూరి తారకరామారావు పరిచయం చేసిన ఎంతో మంది నటులు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు.ఎన్టీఆర్ హయాంలో చిత్రపరిశ్రమకు పరిచయం అయిన వారిలో హీరో డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు.

అప్పటికే డాక్టర్ వృత్తి లో కొనసాగుతున్న ప్రభాకర్ రెడ్డి ఇక అన్న గారి సహాయంతో చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యారు.ఇక ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి అన్నగారి మధ్య మంచి స్నేహ బంధం కూడా పెరిగిపోయింది.

కానీ ఒకానొక సమయంలో వీరి బంధం ఎంతగానో దెబ్బతింది.నటశేఖర కృష్ణ ప్రభాకర్ రెడ్డి దాసరి ముగ్గురు ఒక వర్గంగా ఉండేవారు.

వీరికి కాంగ్రెస్ అంటే అమితమైన అభిమానం.అదే సమయంలో అన్న గారు టిడిపి పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు కానీ అన్నగారి పార్టీకి ఈ ముగ్గురు దగ్గర నుంచి మద్దతు కరువైంది.

దీంతో వీరిపై ఆగ్రహంతో ఇక వీరిని దూరం పెట్టడం మొదలుపెట్టారు ఎన్టీఆర్.

ఇక అదే సమయంలో దాసరి ఎన్టీఆర్కు సన్నిహితమైన ఈనాడుకు పోటీగా ఉదయం అనే దినపత్రికను కూడా ప్రారంభించారు.

Telugu Prabhakar Reddy, Congress, Dasari Yana Rao, Nandamuritaraka, Senior Ntr,

ఎన్టీఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వార్తలు వ్రాస్తూ ప్రజల్లోకి పంపేవారు.అంతే కాదు అన్న గారికి వ్యతిరేకంగా మండలాధీశుడు సినిమా ను కూడా తీయడం గమనార్హం.ఈ సినిమా కోసం కృష్ణ కూడా పూర్తి సహకారాన్ని అందించారు.అప్పట్లో అన్నగారు తాలూకా వ్యవస్థను తీసుకువచ్చారు.ఇప్పుడు వీటిని నియోజకవర్గాలు అంటున్నారు.ఈ క్రమంలోనే ఇక ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన ప్రభాకర్ రెడ్డి కథ సిద్ధం చేయగా దీని మేరకు సినిమాను కూడా రూపొందించారు.

అప్పట్లో మంచి విజయం కూడా సాధించింది.తర్వాత ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఇది అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube