సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకుల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఒక ఇంటర్వ్య్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నాకు తెలుగు చదవడం, రాయడం రాదని మహేష్ తెలిపారు.డైరెక్టర్స్ చెప్పిన డైలాగ్స్ ను విని తాను డైలాగ్ లను చెబుతానని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పుకొచ్చారు.
మహేష్ చెప్పిన ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు చదవడం, రాయడం రాకపోయినా ఏ పదాన్ని ఎలా పలికితే ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యమో మహేష్ సైతం అదే విధంగా పలుకుతారనే సంగతి తెలిసిందే.
దర్శకుడు కొరటాల శివ ఒక సందర్భంలో మాట్లాడుతూ మహేష్ మెమొరీ కిల్లర్ మెమొరీ అని రెండుసార్లు డైలాగ్ వింటే మహేష్ కు ఆటోమేటిక్ గా గుర్తుంటుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.ఈ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు తెరకెక్కాయి.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి హిట్ కావడంతో పాటు అటు మహేష్ కు ఇటు కొరటాల శివకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని మహేష్ బాబు సినిమాలకే పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు.మహేష్ ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
మహేష్ ఈ సినిమాకు 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.రాబోయే రోజుల్లో మహేష్ పారితోషికం మరింత పెరగనుందని తెలుస్తోంది.మహేష్ జక్కన్న కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ సన్నివేశాలతో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.