సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్( Young Rebel Star ) గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ ను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్, ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో( Salaar ) తన క్రేజ్ ను తార స్థాయికి పెంచుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ సోదరుడు అయిన ప్రమోద్( Prabhas Brother Pramod ) సినిమా హీరోగా సినిమాలు ఎందుకు చేయలేదు.అంటూ చాలామంది చాలా సంవత్సరాల నుంచి క్వశన్స్ అయితే అడుగుతున్నారు.దానికి సమాధానంగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అది ఏంటి అంటే ప్రమోద్ కి యాక్టింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు.
అందువల్లే తను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదని తనకి ప్రొడక్షన్ హౌస్ ని పెట్టి సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం ఉండడంతో ప్రభాస్ హీరో అయిన తర్వాత ప్రభాస్ సపోర్ట్ తో ‘యు వి క్రియేషన్స్'( UV Creations ) అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి సినిమాలను నిర్మిస్తున్నాడు.

ఇక మొదటగా ‘మిర్చి ‘( Mirchi Movie ) సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూన్నారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వీళ్ళ బ్యానర్ టాప్ లో నిలిచింది అంటే దానికి ప్రమోద్ చేసిన కృషి చాలా ఉందనే చెప్పాలి… ప్రభాస్ సోదరుడు సినిమా ఇండస్ట్రీకి హీరోగా రాకపోయిన కూడా ప్రొడ్యూసర్ గా చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి…
.







