అక్కినేని కుటుంబం మొత్తం కూడా దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు.వారు ప్రతి రోజు నిత్య వ్యాయామాలు చేస్తూ ఉంటారు.
ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకొని అందరూ కూడా వర్కౌట్ చేయడానికి మొదటి ప్రియాలిటీ ఇస్తారు.ఇది ఇప్పుడు తరం కాదు అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వారి శరీరం లో ఉన్న ఎక్కువ క్యాలరీలను కరిగించేస్తూ ఉంటారు.
పైగా వారు అతి తక్కువ ఆహారాన్ని తింటూ ఉంటారు.మొదటి నుంచి కూడా తక్కువ తినండి ఎక్కువ కాలం జీవించండి అంటూ.అక్కినేని నాగేశ్వరరావు చెప్పేవారు.ఇక తినే ప్రతి పదార్థం విషయంలో కూడా కుటుంబం అంతా కూడా చాలా జాగ్రత్తలు వహిస్తారు.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బిజీగా ఉన్న టైం నుంచి వారు వారి ఇంట్లో పండే కూరగాయలు తింటారు.నాగేశ్వరరావు వంట ఇంటి పక్కనే ఒక కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతిరోజు వాకింగ్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ కిచెన్ గార్డెన్ లో కాసేపు పనిచేస్తే కానీ ఆయనకు రోజు గడవదు.
కాసేపు చెట్లన్నీ కూడా చూసుకొని మొక్కలకి నీళ్లు పోసి, గడ్డి, పరక ఏమైనా ఉంటే తీసివేసి పండిన కూరగాయలను వంటింటికి పంపించి అంతా శుభ్రంగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండేవారు.అలా కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు.ఇప్పటికీ కూడా వారు ఆ కిచెన్ గార్డెన్ ని అలాగే కొనసాగిస్తున్నారు.అలాగే కిచెన్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ ని కూడా కంపోస్ట్ చేస్తూ అక్కడే చెట్లకు ఎరువులుగా వాడుతారు.
ఇలా ఈ కాలంలో ఇంత జాగ్రత్తగా చేసేవాళ్ళు ఉండడం అరుదు అనే చెప్పొచ్చు.ఇక అక్కినేని చాలా తక్కువగా తినేవారు.ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.నాగార్జున అయితే అన్నీ తక్కువ మోతాదులో తీసుకుంటారు.ఇలా వారి కుటుంబం ఇంత ఆరోగ్యంగా హెల్తీగా మరియు ఫిట్ గా ఉండడానికి గల కారణం వారి నిత్య జీవితంలో పాటిస్తున్న అల్బాట్లు అలాగే తీసుకుంటున్న ఆహారం.