డెస్టినీ అంటే ఇదేనేమో.. నటి యమున కారు ప్రమాదం గురించి తెలిస్తే అదే అనిపిస్తుంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన కామెడీ శైలితో ఎంతోమంది అభిమానులను కడుపుబ్బ నవ్వించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కమెడియన్ ఆలీ.ఇప్పుడు ఒక వైపు వెండితెరపై రాణిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అడుగుపెట్టాడు.

 Unknown Facts About Actress Yamuna Actress Yamuna, Comedial Ali , Alito Sardaga-TeluguStop.com

ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా మారిపోయాడు.ప్రేక్షకులు చూడాలనుకుంటున్న కనుమరుగైన హీరోయిన్లను ఆలీతో సరదాగా కార్యక్రమానికి తీసుకువచ్చి సరికొత్త అనుభూతిని పంచుతూ ఉన్నాడు కమెడియన్ అలీ.ఇక ఈ వారం నటి యమున ను తన కార్యక్రమానికి గెస్ట్ గా పిలిచాడు.

ఇక వీరిద్దరి మధ్య సంభాషణ ఎంతో సరదా సరదాగా సాగిపోయింది.

ఈ క్రమంలోనే నటి యమున తన జీవితంలో జరిగిన ఒక అతి పెద్ద యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది.అప్పట్లో ఓ సీరియల్ లో నటిస్తున్నాను.అమ్మవారి గెటప్ లో నటించి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నాను.ఒక హోటల్ దగ్గర ఆగి లంచ్ కూడా చేసాం.

ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ డోరు తీయడానికి వెళ్లాను.కానీ సెంట్రల్ లాక్ కారణంగా డోర్ రాలేదు.

సెక్యూరిటీ అలారం మోగటం మొదలయ్యింది.దీంతో అక్కడికి వచ్చిన ఒక పెద్దాయన ఒక వైర్ కట్ చేయడంతో సెంట్రల్ లాక్ ఓపెన్ అయింది.

కానీ ఆ తర్వాత మాత్రం పని చేయకుండా పోయింది అని అర్థమైంది.

Telugu Alito Sardaga, Comedial Ali, Road, Serial, Tollywood, Yamuna-Latest News

ఇక ఆ తర్వాత కారులో బయలుదేరాము.వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక ప్రమాదకరమైన రహదారి వచ్చింది.అక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

భయపడుతూనే అక్కడినుంచి వెళ్తున్నాం అంతలో ఒక బస్సును ఓవర్టేక్ చేసిన లారీ మా వాహనాన్ని ఢీకొట్టింది.చాలా దూరం వరకు వాహనాన్ని లాక్కెళ్ళింది.

ఆ సమయంలో ఇక డ్రైవర్ కారు లో నుంచి బయట పడ్డాడు.తాను కారులోనే ఇరుక్కుపోయాను.

ఇక వెంటనే డోర్ తీసి బయటకు వచ్చాను.ఇక అంతలోనే కళ్లముందే సినిమాల్లో చూపించినట్లుగా కార్ మొత్తం కాలిపోయింది.

ఇక సెంట్రల్ లాక్ పని చేసి ఉంటే డోర్ ఓపెన్ అయ్యేది కాదు.దీంతో ఇక ఆ క్షణం గురించి తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది అంటూ యమున చెప్పుకొచ్చింది.

Telugu Alito Sardaga, Comedial Ali, Road, Serial, Tollywood, Yamuna-Latest News

ఇక ఈ స్టోరీ గురించి తెలిసిన తర్వాత డెస్టినీ అంటే ఇదేనేమో సరిగ్గా ప్రమాదానికి అరగంట ముందు ఒక పెద్దాయన వచ్చి వైర్ కట్ చేసి సెంట్రల్ లాక్ పనిచేయకుండా చేయడం ఏంటి.ఆ తర్వాత సెంట్రల్ లాక్ పనిచేయకపోవడం కారణం గానే యమున కారు ప్రమాదం నుంచి బయట పడటం ఏంటి ఇదంతా అని డెస్టినీ అంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube