టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. అదే పిచ్చుక గూడు హెయిర్ స్టైల్?

సాధారణంగా సినిమా పరిశ్రమలో ఎప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది.ఏదైనా హీరో సినిమాల్లో కొత్త స్టైల్ తో కనిపించాడు అంటే చాలు యూత్ మొత్తం ఆ స్టైల్ కి ఆకర్షితులవుతు ఉంటారు.

 Tollywood New Hair Style After Dj Tillu Details, Tollywood, Tollywood New Trend,-TeluguStop.com

ఇక తమ అభిమాన హీరో లాగానే తాము కూడా ఉండాలి అని అని కోరుకుంటూ ఉంటారు.ఇలా తమ అభిమాన హీరో లకు తగ్గట్లుగానే హెయిర్ స్టైల్స్ గడ్డం పెంచుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

అయితే మొన్నటి వరకూ ఇండస్ట్రీలో గడ్డం ట్రెండ్ నడిచింది అన్న విషయం తెలిసిందే.చిన్న హీరో అయిన పెద్ద హీరో అయినా అందరూ భారీగా గడ్డం పెంచుకుని సినిమాలు చేశారు అని చెప్పాలి.

కేవలం వెండి తెరపైనే కాదు బుల్లితెరపై ఓంకార్ లాంటి యాంకర్లు కూడా గడ్డంతో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించారు.ఇలా ఎక్కడ చూసినా కూడా పొడవాటి గడ్డంతో కనిపించిన వారే ఎక్కువ.

మరి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గడ్డం ట్రెండ్ పోయి పిచ్చుక గూడు హెయిర్ స్టైల్ ట్రెండ్ వచ్చింది అన్నది తెలుస్తుంది.ఇంతకీ ఈ పిచ్చుక గూడు ఏంటి అంటారా.

అర్థం పర్థం లేని ఇష్టమొచ్చినట్లుగా పెరిగిపోయిన హెయిర్ స్టైల్.

ఒకప్పుడు హీరోలు హెయిర్ స్టైల్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు.

Telugu Birds Nest, Sudheer Babu, Omkar, Koundinya, Tollywood, Tollywood Trend, T

కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా హెయిర్ పెంచేసి అలా వదిలేయడమే ట్రెండ్.డీజే టిల్లు సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ఇక ఇలాంటి హెయిర్ స్టైల్ లోనే కనిపించి యూత్ ని బాగా ఆకర్షించారు.ఇక భీమ్లా నాయక్ సినిమాలో లా లా భీమ్లా అనే పాట పాడిన సింగర్ కౌండిన్య కూడా ఇదే హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకర్షిస్తున్నాడు.ఇక ఇప్పుడు సుధీర్ బాబు కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ లోనే కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ఇష్టమొచ్చినట్లుగా పెరిగిన వెంట్రుకలు కనీసం ఆ వెంట్రుకలకు ఒక స్టయిల్ కూడా ఉండదు.అచ్చంగా పిచ్చుక గూడు గా కనిపిస్తూ ఉంటాయి.ఇక ఇప్పుడు టాలీవుడ్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube