నటుడు తిలకన్ ఈ పేరు చెప్తే ఈ తరం వారికి పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు.ఈయన మలయాళ సినిమా పరిశ్రమలో ఒక టాప్ నటుడిగా కొనసాగారు.
డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి.తిలకన్ పూర్తి పేరు సురేంద్రనాథ్ తిలకన్.1935 జూలైలో పుట్టిన తిలకన్ నాటకాల ద్వారా మొదట తన ప్రతిభను చాటుకున్నాడు.1973లో మలయాళ చిత్రం పెరియార్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.మలయాళ చిత్ర పరిశ్రమలో ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి.ఇక తిలకన్ తన నటనతో పాత్రలకు ప్రాణం పోసేవారు.
200 కు పైగా సినిమాల్లో సహాయ నటుడిగా అనేక పాత్రను పోషించిన తిలకన్ ఉత్తమ జాతీయ సహాయక అవార్డు కూడా అందుకున్నాడు.అంతేకాదు 1999లో పద్మశ్రీ తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.బ్రతికినంత కాలం నాస్తికుడిగా ఉన్న తిలకన్ కమ్యూనిస్టు పార్టీకి మద్దతుదారుడు.కమ్యూనిజాన్ని బాగా ప్రచారం చేసిన నటులలో ఆయన ఒకరు.ఆయన అనారోగ్యంతో చనిపోతే తిలకన్ మృతదేహానికి కమ్యూనిస్టు జెండా కాపారు ఆ పార్టీ పెద్దలు.
ఇక తెలుగులో సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకి తండ్రిగా నటించారు తిలకన్.శ్రీ మహాలక్ష్మి సినిమాలో శ్రీహరి హీరోగా నటిస్తే ఆ సినిమాలో ఆయన విలన్ గా నటించారు.
ఇక జీవితకాలం ఎక్కువగా కాంట్రవర్సీలకే ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు.
2010లో ఆయన నటించిన ఓ చిత్రానికి నేషనల్ అవార్డు దక్కాల్సి ఉండగా ఒక కాంగ్రెస్ పార్టీ పెద్ద అవార్డుని అమితాబచ్చన్ కు వచ్చేలా చేశారంటూ బాహాటంగా విమర్శించి కాంట్రవర్సీకి గురయ్యాడు.అలాగే మలయాళ ఫిలిం ఇండస్ట్రీ ఆయనను అఫీషియల్ గా బ్యాన్ చేసింది.ఆయన నటించిన సినిమాల్లో ఆయన పాత్రను వేరే వారికి ఇచ్చి ఆయనకు అవకాశాలు లేకుండా చేశారు.
దాంతో మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ గా ప్రొటెస్ట్ చేసి మళ్లీ తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్న నటుడిగా తిలకన్ కి మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది.అంతేకాదు ఆయన అభిమానులు సైతం తిలకన్ కి తిరిగి అవకాశాలు ఇవ్వాలని సినిమా షూటింగ్స్ జరుగుతున్న లొకేషన్స్ కి వెళ్లి కూడా ధర్నా చేశారంటే ఆయన ప్రభావం ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక తన 77 వ ఏట తిరవనంతపురంలో కొన్ని నెలల పాటు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు తిలకన్.