నిర్మాతగా మారడమే ఆహుతి కెరీర్ కు అసలు దెబ్బ..

ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కోసారి సినిమా పరిశ్రమలో అంత గుర్తింపు రాదు కొందరు నటులకి.అందుకు కారణాలు అనేకం ఉంటాయి.

సరైన క్యారెక్టర్ రాకపోవడం.సరైన క్యారెక్టర్ వచ్చినా.

సినిమా అంతగా సక్సెస్ కాకపోవడం.ఒకటేమిటీ సవాలక్ష కారణాలు ఉండొచ్చు.సేమ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు నటుడు ఆహుతి ప్రసాద్.1988లోనే ఆయనకు ఆహుతి సినిమా ద్వారా అద్భుత గుర్తింపు వచ్చింది.ఆ సినిమాలో విలన్ కారెక్టర్ చేసి అదరగొట్టాడు.

బయటకు నీతులు చెప్పి.వెనుక గోతులు తవ్వే కన్నింగ్ క్యారెక్టర్ తో అదుర్స్ అనిపించాడు.

Advertisement
Unknown Facts About Actor Ahuthi Prasad, Ahuthi Prasad, Producer, Actor, Charact

కెరీర్ తొలినాళ్లలోనే ఛాలెంజింగ్ పాత్ర చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.నిజానికి మరే నటుడు అయినా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటే ఆయనకు వరుసబెట్టి అవకాశాలు వస్తాయి.

కానీ ఆయనకు సుమారు రెండు దశాబ్దాల పాటు మళ్లీ అవకాశాలు రాలేదు.దానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయాలే అంటారు తోటి సినీ మిత్రులు.1990లో పోలీస్ భార్య అనే సినిమా చేశాడు ప్రసాద్.ఈ సినిమా మంచి విజయం సాధించింది.కొన్ని కన్నడ సినిమాలు కూడా తీశాడు.

అవీ విజయవంతం కావడంతో నిర్మాతగా ముందుకు సాగాడు.ఆ తర్వాత వరుసబెట్టి ఫ్లాపులు రావడంతో కోలుకోలేని దెబ్బ పడింది.

Unknown Facts About Actor Ahuthi Prasad, Ahuthi Prasad, Producer, Actor, Charact

అటు కన్నడ సినిమా పరిశ్రమలో నిర్మాతగా పేరు పొందాడు.నటుడిగా అవకాశాలు ఇస్తే చేస్తాడో? లేదో? అనే అపనమ్మకంతో దర్శకులు ఆయనను పక్కకు పెట్టారు.తనకు అవకాశాలు ఇవ్వాలని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏవో చిన్నా చితకా క్యారెక్టర్లు మాత్రమే ఇచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

మంచి నటుడిగా ఎదగాల్సిన ప్రసాద్.నిర్మాతగా మారడంతోనే అసలు సమస్య వచ్చిపడింది.

Advertisement

ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడతా సినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ ఇచ్చాడు.ఆ క్యారెక్టర్ లో ఆయన సత్తా చాటుకున్నాడు.

ఆ తర్వాత చందమామ సినిమాలోనూ మంచి అవకాశం దక్కింది.ఆ తర్వాత ఆయన స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.

ఆ తర్వాత తను చనిపోయేంత వరకు చక్కటి పాత్రలతో జనాలను అలరించాడు ఆహుతి ప్రసాద్.

తాజా వార్తలు