Super Tuesday : రేపే సూపర్ ట్యూస్‌డే : అసలేంటి ఇది .. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దీనికి ఎందుకంత ప్రాధాన్యత..?

మరికొద్దినెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరగనున్నాయి.

ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ‘‘సూపర్ ట్యూస్‌డే ( Super Tuesday )’’ను కీలకమైనదిగా పరిగణిస్తారు.

ముందస్తు పోటీలు ముగిసి, ఒకే తేదీన షెడ్యూల్ చేయబడిన ప్రైమరీలలో పలు రాష్ట్రాల ఓటర్లు బ్యాలెట్‌లో పాల్గొంటారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల ప్రక్రియ( US President Primary Elections )లో సూపర్ ట్యూస్‌డే అనేది కీలకమైన రోజు, ఎన్నికల ఏడాది మార్చి మొదటి వారం అంటే 5వ తేదీన ఈ ఈవెంట్ జరగనుంది.

సూపర్ ట్యూస్‌డే నాడు .అనేక రాష్ట్రాలు తమ ప్రాథమిక ఎన్నికలు లేదా కాకస్‌లను ఏకకాలంలో నిర్వహిస్తాయి.ఈ ఏకీకృత ఓటింగ్ రోజు అభ్యర్ధుల ఎంపికను ప్రభావితం చేయడానికి వివిధ ప్రాంతాలు , జనాభాకు ప్రాతినిథ్యం వహించే విభిన్న శ్రేణి రాష్ట్రాలను అనుమతిస్తుంది.

ప్రెసిడెన్షియల్ నామినేటింగ్ కన్వెన్షన్‌లకు దాదాపు మూడింట ఒక వంతు మంది డెలిగేట్‌లు సూపర్‌ ట్యూస్‌డేలలో గెలుపొందుతారు.అభ్యర్ధులు తమ పార్టీ నామినేషన్‌లను గెలవడానికి అవసరమైన మొత్తం డెలిగేట్‌లలో గణనీయమైనప భాగాన్ని పొందడంలో సహాయపడతారు.రిపబ్లికన్ డెలిగేట్‌( Republican Delegates )లలో దాదాపు 36 శాతం మంది ఈ ప్రైమరీలు, కాకస్‌లచే ఎంపిక చేయబడతారు.

Advertisement

మార్చి 5న దేశవ్యాప్తంగా రిపబ్లికన్‌కు 15 పోటీలు, డెమొక్రాట్లకు 16 పోటీలు జరుగుతాయి.అలబామా , అలాస్కా , అర్కాన్సాస్ , కాలిఫోర్నియా , కొలరాడో , మైనే , మసాచుసెట్స్ , మిన్నెసోటా , ఉత్తర కరొలినా , ఓక్లహోమా , టేనస్సీ , టెక్సాస్ , ఉటా , వెర్మోంట్ , వర్జీనియా , అమెరికన్ సమోవాలలో ఈ ఎన్నికలు జరుగుతాయి.

మార్చి 5న జరగనున్న సూపర్ ట్యూస్‌డేకి ముందు బైడెన్, ట్రంప్ వారి వారి ప్రైమరీలలో స్పష్టమైన విజేతలుగా నిలిచారు.కాకస్, ప్రైమరీ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ.భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మాత్రం అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి నిరాకరించారు.

రిపబ్లికన్‌లలో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) 244 మంది ప్రతినిధుల మద్ధతును గెలుచుకోగా.నిక్కీ హేలీకి 43 మంది మాత్రమే వున్నారు.వీరు నామినేషన్‌ను దక్కించుకోవాలంటే 1215 మంది ప్రతినిధులు అవసరం.

డెమొక్రాట్ల విషయానికి వస్తే జో బైడెన్‌( Joe Biden )కు 206 మంది ప్రతినిధుల మద్ధతు వుంది.ఆయన రేసులో వుండాలంటే 1918 మంది ప్రతినిధుల మద్ధతు అవసరం.2020 అధ్యక్ష ఎన్నికల ప్రైమరీలలో 14 ప్రైమరీలు ఓటు వేశాయి.సూపర్ ట్యూస్‌డే రిపబ్లికన్ ప్రైమరీలలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఛాలెంజర్ బిల్‌వెల్డ్‌ను ఓడించారు.ఆయన ఆరోజున 11 పోటీలలో ఏడింటిని గెలుచుకున్నారు.

Advertisement

అయినప్పటికీ టెక్సాస్‌ను కోల్పోవడం గమనార్హం.

తాజా వార్తలు