లిప్‌స్టిక్ మొక్క గురించి మీరు ఎపుడైనా విన్నారా? వినకపోతే ఇది మీకోసమే.బోటనీ స్టూడెంట్స్ కి ఈ మొక్క గురించి తెలిసే వుంటుంది.
లిప్‌స్టిక్ మొక్క శాస్త్రీయ నామం ‘ఏస్కినాంథస్ మోనిటేరియా డ్యూన్’.లిప్‌స్టిక్ మొక్క పువ్వులు లిప్‌స్టిక్‌లాగా ఎర్రటి రంగులో ఉంటాయి.
మొదటిసారిగా దీన్ని 1912లో బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ డ్యూన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో దీన్ని కనుగొన్నారు.అత్యంత అరుదైన ఈ ‘లిప్‌స్టిక్’ మొక్కను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొనటం జరిగింది.BSI (బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా) పరిశోధకులు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఈ అత్యంత అరుదైన ‘ఇండియన్ లిప్ స్టిక్ ప్లాంట్’ అని పిలువబడే ‘లిప్‌స్టిక్’ మొక్కను కనుక్కొన్నారు.
2021 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంజా జిల్లాలో ఇది కనిపించింది.సదరు వివరాలను తాజాగా కరెంట్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.ఈ మొక్క మళ్లీ 100 ఏళ్ల తర్వాత కనిపించడం అద్భుతమనే చెప్పుకోవాలి.అంతరించి పోతున్న మొక్కజాతుల్లో ఇది కూడా ఒకటి.ఎస్కినాంథస్ అనే జాతి పేరు గ్రీకు పదం ఐస్కీన్ లేదా ఐస్కిన్ నుండి ఉద్భవించింది.
దీని అర్థం వరుసగా అవమానం లేదా ఇబ్బందిగా భావించడం.ఆంథోస్, అంటే పువ్వు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఫ్లోరిస్టిక్ అధ్యయనాల సమయంలో, చౌలు డిసెంబర్ 2021లో అంజా జిల్లాలోని హ్యులియాంగ్ మరియు చిప్రూ నుండి ఎస్కినాంథస్ యొక్క కొన్ని నమూనాలను సేకరించారు.

ఈ మొక్క 543 నుండి 1134 మీటర్ల ఎత్తులో తేమ మరియు సతత హరిత అడవులలో పెరుగుతుంది.పుష్పించే మరియు ఫలాలు కాసే సమయం అక్టోబర్ మరియు జనవరి మధ్య ఉంటుంది.అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో తరచుగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.
రోడ్ల విస్తరణ, పాఠశాలల నిర్మాణం, కొత్త స్థావరాలు మరియు మార్కెట్లు వంటి అభివృద్ధి కార్యకలాపాలు అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ జాతికి ప్రధాన ముప్పుగా ఉన్నాయి అని కృష్ణ చౌలు కరెంట్ సైన్స్ నివేదికలో తెలిపారు.







