కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు.తెలంగాణకు కేంద్రం రూ.5 వేల కోట్లకు పైగా ఇచ్చిందన్నారు.కానీ పంచాయతీల ఖాతాల్లోకి నిధులు వేసిన గంటలోనే దారి మళ్లాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు చమురు ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు, కానీ పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయని విమర్శించారు.యూపీతో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్ ధర రూ.13 అధికంగా ఉందన్నారు.యూపీలో పెట్రోల్ పై వ్యాట్ 26 శాతం ఉంటే తెలంగాణలో 35 శాతం ఉందని తెలిపారు.2021-22 లో పెట్రోల్, డీజిల్ పై రూ.28 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ నేతలు అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.







